Leading News Portal in Telugu

Venu Swamy’s public apology to Telangana Women’s Commission


Venu Swami: నాగచైతన్య, శోభితల జోస్యం.. వేణు స్వామి బహిరంగ క్షమాపణలు

తెలంగాణ ఉమెన్ కమిషన్ కి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు వివాదాస్పద సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి. గతంలో హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి ఈ క్రమంలో వెల్లడించారు. గతంలో నాగచైతన్య, శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకున్న క్రమంలో వారు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పాడు వేణు స్వామి. ఇద్దరూ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే మళ్లీ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పాడు వేణు స్వామి. వేణు స్వామి వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు.

Harish Rao: ప్రజాపాలన కాదు.. ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన

ఈ క్రమంలో వేణు స్వామి వివరణ కోరుతూ ఆయనకి తెలంగాణ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉమెన్ కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టుని వేణు స్వామి ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణు స్వామికి మరొకసారి నోటీసులు జారీ చేసింది ఉమెన్ కమిషన్. దీంతో నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయంకు హాజరై తన వ్యాఖ్యలను ఉపసరించుకున్నట్లు తెలిపిన వేణు స్వామి ఈ విషయంలో ఉమెన్ కమిషన్ క్షమాపణ కోరాడు వేణుస్వామి. ఇక ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం చేయొద్దని, వేణు స్వామిని హెచ్చరించింది ఉమెన్ కమిషన్.