Leading News Portal in Telugu

IT Raids concluded at Dil Raju’s daughter’s house


Hanshita Reddy: దిల్ రాజు కుమార్తె ఇంట ముగిసిన ఐటీ సోదాలు

దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి నివాసంలో ఐటీ రైడ్స్ ముగిశాయి. ఆమె నివాసంలో లాకర్స్ తో పాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి నుండి దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి నివాసంలో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఆమె నివాసంలో రైడ్స్ ముగించుకుని ఐటీ అధికారులు వెళ్ళిపోయారు. నిన్న ఉదయం దిల్ రాజు కుమార్తె ఇంటికి నాలుగు ఐటి బృందాలు చేరుకున్నాయి. అప్పటినుంచి ఆమె నివాసంలో రైట్స్ జరుగుతూనే ఉన్నాయి.

READ MORE: IND vs ENG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. సుర్యకుమార్ వ్యూహం ఇదే..

నిన్న రాత్రి అంతా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఉదయం మరొక టీం ఈ సోదాల్లో జాయిన్ అయింది. ఇక నిన్న దిల్ రాజు కుమార్తె ఆమె నివాసంలో లేకపోయినా సరే రెయిడ్స్ మాత్రం జరిగాయి. దిల్ రాజు భార్య ఉంటున్న నివాసంలో కూడా ఈ సోదాలు నిర్వహించారు అధికారులు. ఈరోజు కుమార్తె వచ్చిన తరువాత ఇంట్లో ఉన్న లాకర్లు సోదా చేయడమే కాదు బ్యాంక్ ఖాతాల వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు దిల్ రాజు చేసిన మూడు సినిమాల కలెక్షన్స్ వివరాలు కూడా అడిగి తీసుకున్నారు అధికారులు. దిల్ రాజు నిర్మాతగా గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు చేయగా డాకు మహారాజ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు.

READ MORE: Congress: దావోస్‌ వెళ్లని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం.. విభేదాలే కారణమని బీజేపీ ఆరోపణ..