Leading News Portal in Telugu

Movie benefit shows canceled in Telangana


Telangana: తెలంగాణలో సినిమా బెనిఫిట్‌ షోలు రద్దు!

తెలంగాణలో సినిమా బెనిఫిట్‌ షోలు రద్దు చేయనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సినిమా బెనిఫిట్‌ షోలను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 నుంచి ఉదయం 8.40 వరకు సినిమాలను ప్రదర్శించటానికి వీల్లేదని తేల్చి చెప్పింది తెలంగాణ హైకోర్టు.

Thandel : “తండేల్” ట్రైలర్ డేట్ వచ్చేసింది.. చైతు పోస్టర్ తో కన్ఫాం చేసిన మేకర్స్

ఏమైనా సినిమాల బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చి ఉంటే వాటిని రద్దు చేయాలని ప్రభుత్వానికి కూడా తాజాగా స్పష్టం చేసింది. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 నుంచి ఉదయం 8.40 వరకూ సినిమాలను ప్రదర్శించటానికి వీల్లేదని హైకోర్టు ఈ సంధర్భంగా వెల్లడించింది. ఇక ఈ క్రమంలో బెనిఫిట్‌ షోల రద్దుకు సంబంధించిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.