- దళపతి విజయ్ చివరి చిత్రం పోస్టర్ విడుదల.
- సినిమా టైటిల్ గా ‘జన నాయగన్’ ఖరారు.

Jana Nayagan: సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ చివరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుండి, ప్రేక్షకులు సినిమా టైటిల్, విజయ్ ఫస్ట్ లుక్ ఇంకా కొత్త అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. విజయ్ చివరి చిత్రం దళపతి 69, దీని టైటిల్ కోసం మేకర్స్ నేడు ప్రకటించారు. వాగ్దానం చేసినట్లుగానే రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ మేకర్స్ చిత్రం టైటిల్, విజయ్ ఫస్ట్ లుక్ను వెల్లడించారు. కెవిఎన్ ప్రొడక్షన్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విజయ్ చివరి చిత్రం పోస్టర్ను విడుదల చేసింది. దానితో పాటు దాని టైటిల్ను కూడా ప్రకటించింది. ఇందులో సినిమా పేరును ‘జన నాయగన్’ గా ప్రకటించారు.
ఈ పోస్టర్ లో హీరో విజయ్ వెనకాల వేల సంఖ్యలో అభిమానులు ఉండగా.. అతడు సెల్ఫీ తీసుకున్నట్లుగా కనబడుతోంది. సినిమా పేరును గమనించినట్లయితే.. సినిమా పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లుగా కనబడుతోంది.