Leading News Portal in Telugu

The film unit of Sankranthiki Vasthunam is coming and it created a buzz in Rajahmundry


  • సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా సందడి
  • హాజరైన హీరో వెంకటేష్
  • శ్యామల థియేటర్ వద్ద ఘన స్వాగతం
Sankranthiki Vasthunam: రాజమండ్రిలో సందడి చేసిన “సంక్రాంతికి వస్తున్నాం” యూనిట్

సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ రాజమండ్రిలో సందడి చేసింది. సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా హీరో వెంకటేష్ రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి. శ్యామల థియేటర్ వద్ద బాణాసంచా కాల్చి… హీరో వెంకటేష్ , దర్శకుడు అనిల్ రావిపూడి యూనిట్ సభ్యులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రేక్షకులతో హీరో వెంకటేష్ కొద్దిసేపు సందడి చేశారు. హీరో వెంకటేష్ తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత శిరీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

READ MORE: EPFO ​​ATM Card: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు!

అనంతరం జరిగిన వీడియో సమావేశంలో హీరో వెంకటేష్ మాట్లాడుతూ ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారని, ఈసారి పండుగ మాకు గ్రాండ్ సంక్రాంతి అంటూ ఆనందం వ్యక్తం చేశారు. గోదావరి యాసతో మాట్లాడడం సినిమాకు బాగా కలిసి వచ్చిందని అన్నారు. గోదావరి జిల్లాలు సినిమా షూటింగ్స్ కి అనుకూలం అంటూ కితాబిచ్చారు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు హీరో వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయోత్సవాన్ని ప్రేక్షకులతో కలిసి పంచుకున్నారు. సినిమా విజయవంతం కావడానికి సహకరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

READ MORE: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ “హెల్త్ ఇన్సూరెన్స్‌”పై వివాదం.. సామాన్యులకు ఇలాగే ఇస్తారా..?

దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఒకటికి ఐదుసార్లు సినిమా చూసేందుకు థియేటర్లకు వస్తున్నారని సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయోత్సవాన్ని పంచుకున్నారు. సినిమాలో బుల్లి రాజు పాత్ర డైలాగ్స్ వలన ఎలాంటి కాంట్రివర్సి లేదన్నారు. బుల్లి రాజు డైలాగ్స్ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని ఆనందంతో చెప్పారు. ఓటీటీలో ఉండేదాన్ని బుల్లి రాజు క్యారెక్టర్ ద్వారా చూపించామన్నారు. ఈస్ట్ గోదావరిలో ఇప్పటికే 10 కోట్ల కలెక్షన్స్ దాటాయని. నిర్మాత శిరీష్ వెల్లడించారు.