Leading News Portal in Telugu

Vishal not picking up Anjali’s call


Anjali: అంజలి కాల్ లిఫ్ట్ చేయని విశాల్

విశాల్ హీరోగా వరలక్ష్మి, అంజలి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం మద గజ రాజా. కామెడీ సినిమాలతో పాటు హారర్ సినిమాలు బాగా చేస్తాడనే పేరు ఉన్న దర్శకుడు సి సుందర్ దర్శకత్వంలో ఈ సినిమా దాదాపు 12 ఏళ్ల క్రితం రూపొందింది. అయితే అనేక కారణాలతో ఈ సినిమా అప్పుడు విడుదలకు నోచుకోలేదు. అయితే తాజాగా ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో రిలీజ్ చేస్తే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. 31వ తేదీన తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి కేవలం హీరోయిన్లు మాత్రమే హాజరయ్యారు.

Nandamuri Balakrishna: బాలకృష్ణని ఘనంగా సన్మానించిన ‘అఖండ 2: తాండవం’ టీం

విశాల్ తో పాటు సుందర్ కానీ ఇంకెవరూ కానీ హాజరు కాలేదు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో స్టేజ్ ఎక్కిన తర్వాత అంజలి, విశాల్ కి కాల్ చేసింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆయనతో తెలుగు మీడియాతో మాట్లాడించే ప్రయత్నం చేసింది. కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు, దీంతో అంజలి ఫోన్ లిఫ్ట్ చేయని విశాల్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టుకోవాలంటూ ఆమె సూచనలు చేసింది. అలాగే చేసిన సినిమా ప్రమోషన్స్ కి రాని విశాల్ అంటూ కూడా థంబ్నెయిల్ పెట్టాలంటూ ఆమె సూచనలు చేసింది. ఇక ఈ సినిమాకి సంగీతం అందించిన విజయ్ ఆంటోనీ మాత్రం వరలక్ష్మి శరత్ కుమార్ కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి ఆమెతో పాటు తెలుగు మూవీ మీడియాతో కాసేపు ముచ్చటించారు.