Leading News Portal in Telugu

Samantha’s viral comments saying that this is the reason for reducing movies


Samantha: సినిమాలు తగ్గించడానికి కారణం ఇదే.. మొత్తానికి బయట పడిన సమంత

అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి తనకంటి మంచి స్టాండమ్ ఏర్పర్చుకుంది. సమంత ఊ అనాలేగానీ ఇప్పటికీ చేతినిండా సినిమాలే సినిమాలు. కానీ ఆమె మాత్రం నో అంటున్నారు. ఒకప్పటిలా సమంత సినిమాలు చేయట్లేదు..? వరుసగా అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నా కూడా. కావాలనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. మరి ఇది తనకు తానుగా తీసుకున్న నిర్ణయమా..? లేదంటే ఇంకేమైనా బ్యాక్ స్టోరీ ఉందా అనేది తెలియదు. కానీ చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే ఈ మధ్యే ఓ వేడులో పాల్గొన్న స్యామ్.. తనెందుకు సినిమాలు తగ్గించారనే విషయంపై క్లారిటీ ఇచ్చింది..

సమంత మాట్లాడుతూ ‘అనుకుంటే ఇప్పటికీ చాలా సినిమాలు అవకాశాలు లైన్ లో ఉన్నాయి. కానీ నేనిప్పుడు ఆ పరిస్థితుల్లో లేను. చేసే ప్రతి సినిమా నాకు చివరి సినిమాలాగే భావిస్తున్నాను.నేను చేసే పాత్రలు ప్రేక్షకులపై ప్రభావం చూపించాలి.. అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేయాలనుకుంటున్న. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో రాజీ, ‘సిటాడెల్‌’లో పాత్ర అలా చేసినవే. నాకు ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ డిజైన్ చేస్తున్న రాజ్ డికేకు థ్యాంక్స్. ప్రజంట్ ‘రక్త్ బ్రహ్మాండ్’ సిరీస్‌లోనూ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నా’ అంటూ చెప్పుకోచ్చింది సమంత.

తన మాటలను బట్టి చూస్తే ఈ మయోసైట్స్  వ్యాధి నుంచి కోలుకున్నాక స్యామ్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. రెగ్యులర్ కారెక్టర్స్‌కు పూర్తిగా దూరంగా ఉంటూ, చాలా సెలెక్టివ్‌గా స్టోరీ ఎంచుకుంటుంది. అంతేకాదు తన హెల్త్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్స్ సైన్ చేస్తానంటుదట. ఇక మునుపటి సామ్‌ని చూడాటం ఇప్పట్లో కుదరకపోవచ్చు.