Leading News Portal in Telugu

Jhansi Crucial Commentts on jani Master case


Jhansi: జానీ మాస్టర్ పై కేసు గెలిచాం.. ఝాన్సీ కీలక ప్రకటన

నటి టాలీవుడ్ లైంగిక వేధింపుల కమిటీలో కీలక సభ్యురాలుగా వ్యవహరిస్తున్న యాంకర్ కం నటి ఝాన్సీ తన సోషల్ మీడియా వేదిక కీలక అప్డేట్ షేర్ చేసింది. అదేంటంటే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు నెగ్గినట్లుగా ఆమె వెల్లడించింది. వర్క్ ప్లేస్ లో లైంగిక వేధింపులు జరిగినట్లు ప్రూవ్ అయిన తర్వాత ఫిలిం ఛాంబర్ ఇచ్చిన ఆర్డర్లకు వ్యతిరేకంగా డిస్ట్రిక్ట్ కోర్ట్ ని జానీ మాస్టర్ ఆశ్రయించాడు. అయితే కోర్టు జానీ మాస్టర్ వేసిన అప్లికేషన్ ని తోసిపుచ్చింది కోర్టు తీసుకున్న నిర్ణయం పని ప్రదేశాలలో మహిళలకు ఎంత సేఫ్టీ ముఖ్యం అనేది మరోసారి చాటి చెప్పింది అని ఝాన్సీ పేర్కొంది. అలాగే ప్రతి సంస్థలో పోష్(POSH) రూల్స్ ఉండాలని కూడా మరోసారి చాటి చెప్పినట్లు అయిందని ఆమె చెప్పుకొచ్చారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఫెడరేషన్తో కలిసి ఈ విషయంలో పోరాడుతున్నందుకు ధన్యవాదాలు చెబుతూ ఆమె రాసుకొచ్చారు.