Leading News Portal in Telugu

‘Tere Ishq Mein’ will be released in the combination of Anand and Dhanush.


Danush: 12 ఏళ్ల తర్వాత రిపీట్ కానున్న ఆ కాంబో

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ‘రాయన్’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు ధనుష్.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అన్నదమ్ముల సంబంధం నేపథ్యంలో కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ధనుష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలుగులోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ధనుష్ బాలీవుడ్ లో ఓ మంచి లవ్ స్టోరితో రాబోతున్నాడు. వివరాలోకి వెళ్ళితే..

ధనుష్‌ కథానాయకుడిగా ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రాన్‌జనా’ (2013) మూవీ అంత చూసే ఉంటారు. సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఎంత మంచి హిట్ అందుకుందో చెప్పకర్లెదు.అద్భుతమైన ప్రేమకథగా యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఆనంద్‌, ధనుష్ వీరిద్దరి కాంబినేషన్‌లో ‘తేరే ఇష్క్‌ మే’ పేరుతో మరో లవ్‌స్టోరీ తెరకెక్కుతుంది. టీ సిరీస్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నఈ చిత్రం నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. AR రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలో కథానాయిక కృతి సనన్ స్క్రీన్‌ను పంచుకోనుంది.

అయితే తాజాగా హీరోయిన్ కృతిని కన్ఫామ్ చేస్తూ మేకర్స్ ఒక ఆసక్తికరమైన ప్రోమోను పంచుకున్నారు. ఈ ప్రోమోలో చుట్టురా అంతా పోలీసులు  లాఠీ ఛార్జ్ చేస్తూ కనిపించారు. వారి మధ్యలో నుంచి నడుచుకుంటూ వచ్చిన కృతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించు కోవడానికి సిద్ధమవుతుంది.దీనికోసం ముందుగా సిగరెట్ కాల్చి ఎమోషనల్ గా చూస్తుంది కృతి.ఇక ఈ క్లిప్‌ను పంచుకుంటూ, ధనుష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా వ్రాశాడు.. ‘కొన్ని ప్రేమ కథలు మంటల నుండి ఎదగడానికి ఉద్దేశించబడ్డాయి’ అని తెలిపాడు.