Leading News Portal in Telugu

KVN Productions : భారీ రిస్క్ చేస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్.. గట్టెక్కేనా..?


భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సైన ఓ కన్నడ నిర్మాణ సంస్థ పడిపోయిన చోటే లేచి నిలబడేందుకు ట్రై చేస్తుంది. శాండిల్ వుడ్ లో క్రేజీ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌజ్ ఆ పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోపైనే నమ్మకాన్నిపెట్టుకుంది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ చిత్రాలను దింపేస్తోన్న ఈ సంస్థ. శాండిల్ వుడ్ లో తక్కువ టైంలో బిగ్గెస్ట్ నిర్మాణ సంస్థగా ఎదిగింది కెవిఎన్ ప్రొడక్షన్ హౌజ్. తెలుగు భారీ బడ్జెట్ చిత్రాలను కన్నడ డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకుని కర్ణాటకలో విడుదల చేసేది KVN సంస్థ. RRR, సీతారామం, కల్కి, దేవర ఈ జాబితాలో ఉన్నాయి. రీసెంట్లీ కంగువాతో డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుని చేతులు కాల్చుకుంది.

Also Read : Sanjana : డైరెక్టర్ గా మారిన హీరోయిన్.. మొదటి సినిమా ఆ హీరోతోనే

ఇప్పుడు పడిపోయిన చోటునే లేచి నిలబడాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది నిర్మాణ సంస్థ. కంగువాకు డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుంటే ఈ సారి రిస్క్ చేసి తమిళంలో ఓ సినిమాను నిర్మిస్తోంది. ఇళయదళపతి విజయ్ తో జన నాయగన్ తెరకెక్కిస్తోంది. విజయ్ చివరి చిత్రంగా భావిస్తున్న దళపతి 69 టైటిల్ ఎనౌన్స్ మెంట్. ఫస్ట్ లుక్ పోస్టర్ రీసెంట్లీ రిలీజ్ చేశారు మేకర్స్. తమిళంలో విజయ్ జననాగయన్ సినిమానే కాకుండా  శాండిల్ వుడ్ లో కూడా భారీ బడ్జెట్ చిత్రాలను తీసుకు వస్తుంది. ధ్రువ సర్జాతో కేడీ, యష్ తో టాక్సిక్ నిర్మిస్తోంది. ఈ మూడు కూడా పాన్ ఇండియన్ ను ఏలేందుకు వస్తున్నవే. కానీ యష్, ధ్రువ కన్నా విజయ్ మార్కెట్ ఎక్కువ కాబట్టి ఈ సినిమాపైనే హోప్స్ పెట్టుకుంది నిర్మాణ సంస్థ. విజయ్ క్రేజ్ కు తగ్గట్లే సినిమాను నిర్మిస్తుందని టాక్.