Leading News Portal in Telugu

Vishwak Sen Bandhuk Movie shelved due to Shoot Postponements


Vishwak Sen: విశ్వక్ సేన్ దెబ్బకి సినిమా క్యాన్సిల్?

ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన విశ్వక్సేన్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకునే పనిలో ఉన్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించే పనిలో బిజీబిజీగా ఉన్నాడు. గత ఏడాది ఆయన నటించిన గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఈ ఏడాది మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన నటించిన లైలా సినిమా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే నిజానికి విశ్వక్ సేన్ హీరోగా బంధూక్ అనే సినిమా అనౌన్స్ చేశారు. కొత్త డైరెక్టర్ శ్రీధర్ గంటా దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తారని గత ఏడాది అనౌన్స్ చేశారు.

Varalaxmi: మరో తెలుగు సినిమాకి వరలక్ష్మీ గ్రీన్ సిగ్నల్?

అయితే తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కడం లేదని అటకెక్కిందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ విశ్వక్సేన్ పలుసార్లు వాయిదా వేస్తూ రావడంతో సుధాకర్ చెరుకూరికి సినిమా మీద ఆసక్తి సన్నగిల్లి ఎట్టకేలకు సినిమా ఆపి వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మరో హీరోతో మరో ప్రాజెక్ట్ తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక బంధూక్ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో విశ్వక్సేన్ ప్రస్తుతానికి అనుదీప్ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా మీద ఫోకస్ పెట్టాడు. మరొక పక్క సుధాకర్ చెరుకూరి దీక్షిత్ శెట్టి- దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సోదరుడు చేస్తున్న సినిమాతో పాటు నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల పారడైజ్, ప్రశాంత్ వర్మ- నందమూరి మోక్షజ్ఞ సినిమాలతో పాటు చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమాలు లైన్ లో పెట్టారు..