రాఘవ లారెన్స్ 3 కోట్ల విరాళం.. నువ్వు దేవుడు సామీ..
రాఘవ లారెన్స్ సంచలనం సృష్టించాడు. స్టార్ హీరోలను కూడా మంచిపోయాడు. ఇండస్ట్రీకి డాన్సర్‌గా వచ్చి నటుడిగా మారి.. కొరియోగ్రఫర్‌గా సంచలనాలు రేపి.. ఇప్పుడు దర్శకుడిగా దుమ్ము దులిపేస్తున్నాడు లారెన్స్. ఈయన కరోనా బాధితులకు తన వంతు సాయంగా 3 కోట్ల విరాళం అందించాడు. ఇది తెలిసిన తర్వాత అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సినిమా రంగంలోనే కాదు ప్రజాసేవలో కూడా ఎప్పుడూ ముందే ఉంటాడు ఈయన. తన సంపాదనలో చాలా వరకు ఓ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అందులో వికలాంగులకు సహాయం చేస్తుంటాడు. అంతేకాదు.. ఇంకా చాలా సాయం చేస్తుంటాడు లారెన్స్.
ఇప్పుడు కరోనాపై పోరాటంలో తన వంతు సాయంగా ఏకంగా 3 కోట్లు అందించాడు ఈయన. అందులో తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు.. ప్రధానమంత్రి సహాయనిధికి 50 లక్షలు.. డాన్సర్స్ అసోషియేషన్‌కు 50 లక్షలు.. 50 లక్షలు సినిమా కార్మికులకు.. వికలాంగులకు 25 లక్షలు.. 75 లక్షలు తన సొంతూరి వాళ్ళకు ఇచ్చాడు లారెన్స్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా కోసం తీసుకున్న 3 కోట్ల అడ్వాన్స్ ఒక్క రూపాయి కూడా తన ఖాతాలో వేసుకోకుండా కరోనాపై చేస్తున్న పోరాటానికి విరాళంగా ఇచ్చేసాడు లారెన్స్.