Leading News Portal in Telugu

విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వచ్చే డేట్ ఫిక్స్..

ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, సన్‌ నెక్ట్స్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వచ్చాకా.. సినిమా థియోటర్స్‌లో నడుస్తూ ఉండగానే అమెజాన్ ప్రైమ్‌‌, జీ 5, సన్‌ నెక్ట్స్‌లో రిలీజైతున్నాయి. ఒక రకంగా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు బాగానే వర్కౌట్ అయినా.. డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రం ఒక సినిమా నడుస్తుండగా ఓటీటీ ఫ్లాట్‌పామ్‌లో విడుదల కావడం ఎంతో కొంత నష్టాన్ని తెచ్చిపెడుతోంది. అందుకే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు రిలీజ్‌కు ముందు ఆయా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌తో ఒప్పందం చేసుకుంటున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ‘వరల్ట్ ఫేమస్ లవర్’ సినిమా ఏప్రిల్ 15న సన్‌ నెక్ట్స్‌లో స్ట్రీమ్ కానున్నట్టు సన్ నెక్ట్స్ ప్రకటించింది.