రూమ్‌కు వస్తావా.. స్టార్ హీరోయిన్‌ను గోకిన టాప్ హీరో..
ఇండస్ట్రీ ఏదైనా కూడా మీటూ అనేది కామన్.. ఇక్కడ అమ్మాయిలకు సేఫ్టీ లేదని చాలా మంది హీరోయిన్లు చెప్పారు. అది ప్రూవ్ అయింది కూడా. అయితే కొందరు మాత్రమే నోరు విప్పుతున్నారు.. మరికొందరు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. స్టార్ హీరోయిన్లు ఎవరూ కూడా తమకు మీటూ సమస్య రాలేదని.. కానీ ఇక్కడ అలాంటి సమస్యలు మాత్రం ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటి మరో సంచలన విషయమే బయటికి వచ్చింది. అది చెప్పింది కూడా ఎవరో కాదు.. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ ఇషా కొప్పికర్. తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చెప్పింది ఈమె.
మిలినియం మొదట్లో అంటే 2000లో వచ్చిన ఫిజా సినిమాతో ఇషా బాలీవుడ్ జర్నీ మొదలైంది. ఆ వెంటనే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కంపెనీ సినిమాలోని ఖల్లాస్ అనే ఐటెం సాంగ్‌తో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇషా. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇషా.. తనకు ఎదురైన కొన్ని అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తాను ఓ సినిమాకు సైన్ చేసినపుడు ఆ నిర్మాత కాల్ చేసి తనను హీరోకు సపరేట్‌గా ఫోన్ చేయమన్నాడని చెప్పింది. సరే అని తాను ఆ హీరో గారికి కాల్ చేస్తే ఆయన తనను ఒంటరిగా రూమ్‌కు వచ్చి కలవామన్నాడని చెప్పింది.