అమీర్ ఖాన్ కొడుకు అక్కడే ఇరుక్కుపోయాడు పాపం..
లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఎన్నో తిప్పలు పడుతున్నారు. స్వస్థలాలకు వెళ్లలేక ఎన్నో బాధలు పడుతున్నారు. వలస కూలీల బతుకులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే స్టార్స్ కూడా కొందరు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు షూటింగ్స్ కోసమని విదేశాలకు వెళ్లి అక్కడే లాక్ అయిపోయారు. ఇక విజయ్ కొడుకు కూడా కెనడాలో ఉన్నాడు. ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తనయుడు కూడా మహారాష్ట్రలో ఇరుక్కుపోయాడు. దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో ఆయనక్కడే ఉన్నాడు. దాంతో అమీర్ కొడుకు జునైద్ మహారాష్ట్రలోని పాంచ్ గానీ హిల్ స్టేషన్లోని ఓ బంగ్లాలో ఇరుక్కుపోయాడు.
మరోవైపు అమీర్ ఖాన్ మాత్రం తన కుటుంబంతో కలిసి ముంబైలోని పాలీహిల్లో ఉంటున్నాడు. తండ్రి ఓ చోట.. కొడుకు ఓ చోట ఉండటంతో ఈయన కుటుంబం కూడా ఆందోళన పడుతున్నారు. మూడు వారాలు లాక్ డౌన్ అయిపోయిన తర్వాత వస్తాడులే అనుకుంటే.. ఇప్పుడు మరో 15 రోజులు పొడిగించడంతో జునైద్ అప్పటి వరకు అక్కడ ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. విజయ్ కొడుకు జోసెఫ్ కూడా కెనడాలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. ఆయన కూడా అక్కడే లాక్ అయిపోయాడు.