పెళ్లైన దర్శకుడితో తెలుగు యాంకర్ ఎఫైర్.. ఆయన భార్య చేతిలో..
తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది యాంకర్స్ ఉన్నారు. అయితే అంతా స్టార్స్ మాత్రం కాలేదు. తెలుగులో యాంకర్ అంటే సుమ కనకాల మాత్రమే గుర్తొస్తుంది. దాంతో మిగిలిన యాంకర్స్ చాలా మంది బ్రేక్ కోసం చూస్తున్నారు. అనసూయ, రష్మి, శ్రీముఖి లాంటి వాళ్లు పర్లేదు అనిపించుకుంటున్నారు. అయితే వీళ్లు కాకుండా మిగిలిన అమ్మాయిలకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. యాంకరింగ్‌లో నెగ్గుకురాలేక.. ప్రస్తుతం ఉన్న పోటీ తట్టుకోలేక వాళ్లకేం చేయాలో కూడా పిచ్చెక్కిపోతుంది. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ఇక్కడ బతకాలంటే కాంప్రమైజ్ అవక తప్పదేమో అనే మైండ్ సెట్‌కు కూడా వచ్చేసారు. అందం, టాలెంట్ ఉన్నా కూడా బ్రేక్ ఇచ్చే వాళ్ల కోసం చూస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఇప్పటికీ తమదైన రోజు కోసం చూస్తూనే ఉన్నారు కొందరు యాంకర్లు.
ఆఫర్స్ కోసమే కాదు.. కొత్త అమ్మాయిలు యాంకరింగ్‌లో సత్తా చూపించాలన్నా కూడా కాంప్రమైజ్ కాక తప్పడం లేదనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. నిజాయితీగా విజయం సాధించిన వాళ్లున్నా కూడా ఇప్పుడు వచ్చే వాళ్లకు మాత్రం అంత ఓపిక లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే కొందరు అమ్మాయిలు ఇప్పటికీ అడ్డదారులు తొక్కుతున్నారని ఇండస్ట్రీలో వార్తలు కూడా వినిపిస్తుంటాయి. ఆఫర్స్ కోసం దర్శక నిర్మాతలతో ఎఫైర్స్ పట్టుకొని.. వాళ్ళతో ఎంజాయ్ చేసేవాళ్లు కూడా ఇండస్ట్రీలో కొందరు ఉంటారు. ఇప్పుడు ఓ బుల్లితెర యాంకర్ కూడా ఇదే చేసిందని తెలుస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో కొన్ని షోలతో పాటు కామెడీ స్కిట్స్ కూడా చేసే ఓ యాంకర్.. పెళ్లైన దర్శకుడితో ఎఫైర్ పెట్టుకుని పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కిందని ప్రచారం జరుగుతుంది.