EBM News Telugu

Health : కరోనాకు ఆయుర్వేదంతో చెక్… ఇలా చెయ్యండి..

0

వైరస్‌ని భారతీయ ఆయుర్వేదం అడ్డుకోగలదా? అడ్డుకోలేదా? అన్న ప్రశ్నకు సోషల్ మీడియాలో ఎన్నో ఆన్సర్లున్నాయి. చాలా మంది ఆయుర్వేదంతో కరోనా పోతుందని అన్నారు. అది నిజం కాదు. కరోనా వైరస్‌ని ఆయుర్వేద మందులు అడ్డుకోగలవని ఇంకా నిరూపణ కాలేదు. మరైతే… పైన ఆ హెడ్డింగ్ ఎందుకు ఎలా పెట్టానన్న డౌట్ మీకు రావచ్చు. నిజమే… కరోనాను మన ఆయుర్వేదం డైరెక్టుగా అడ్డుకోలేదు కానీ… కరోనాను అడ్డుకునే శక్తి సామర్ధ్యాలను మన శరీరంలోని యాంటీ బాడీలకు (మంచి బ్యాక్టీరియా) ఆయుర్వేదం ఇవ్వగలదు. ఈ యాంటీ బాడీలనే మనం సింపుల్‌గా వ్యాధి నిరోధక శక్తి అంటున్నాం. ఈ మంచి బ్యాక్టీరియా శరీరంలో ఎంత ఎక్కువగా ఉంటే… అంతగా అది వైరస్‌తో పోరాడగలదు. సరిహద్దుల్లో ఎక్కువ సైన్యం ఉన్న దేశం గెలిచినట్లుగా… ఎక్కువ యాంటీబాడీలు ఉన్న బాడీ… వైరస్‌పై విజయం సాధిస్తుంది.

భారత ఆయుర్వేదంలో భాగమైన తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, సొంఠి (ఎండిన అల్లం), ఎండు ద్రాక్షను వాడటంతో పాటూ… యోగా రెగ్యులర్‌గా చెయ్యాలి. ఫలితంగా మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దానికి వేరే పనేమీ ఉండదు… బాడీలోకి వచ్చే వైరస్‌తో పోరాడటం తప్ప.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా… ఆయుర్వేద ప్రయోజనాల్ని గుర్తుచేస్తూ… ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రోటోకాల్‌ని పాటిస్తూ… ఫిట్‌గా ఉండాలనీ, ఆనందంగా జీవించాలని సూచించారు. ఈ ఆయుష్ శాఖ చెప్పిన అంశాల్ని పాటిస్తే… కరోనాయే కాదు… చాలా వ్యాధులకు మనం బ్రేక్ వేయగలం. ఈ అంశాల్లో గోరువెచ్చటి నీరు తాగడం, యోగసనాలు వెయ్యడం, ప్రాణాయామం చెయ్యడం, రోజూ 30 నిమిషాలు ధ్యానం చెయ్యడం కూడా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.