EBM News Telugu

Health : వెజిటేరియన్ వేగాన్ అవుతున్నారా… మీకు కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ…

0

Health | Vegan LifeStyle : మాంసం తినకపోతే ప్రోటీన్స్ లోపం వస్తుందని కొందరు అంటుంటారు. అది నిజం కాదు. ప్రోటీన్స్ అనేవి గింజలు, పప్పులు, కూరగాయల్లో కూడా లభిస్తాయి. అందువల్ల వేగాన్‌గా మారే వారికి అలాంటి లైఫ్‌స్టైల్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆనందం కలుగుతుంది. వేగాన్ లైఫ్ స్టైల్ పాటించేవారిని వేగాన్స్ అంటారు. వీళ్లు ఎక్కువగా… మొక్కలకు సంబంధించిన ఆహారం తీసుకుంటారు. డైరీ ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, తేనె, జిలాటిన్ వంటివి వాడరు. నిజానికి వేగాన్లు అయినంత మాత్రాన మొక్కల ఆహారం మాత్రమే తినాలని రూల్ ఏమీ లేదు. జంతువులు, ప్రాణులపై జరుగుతున్న హింసను అడ్డుకోవడానికే… ఈ వేగానిజం అమల్లోకి వచ్చింది. అందువల్ల వేగాన్ లైఫ్‌స్టైల్ ప్రయోజనాలు తెలుసుకుందాం.
1.కాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ : 2015లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)… రెడ్ మీట్‌ను గ్రూప్ 2 కార్సినోజెన్‌గా చెప్పింది. అంటే రెడ్ మీట్ తింటే… కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అర్థం. ప్రాసెస్ చేసిన మాంసాన్ని WHO… గ్రూప్ 1 కేటగిరీలో ఉంచింది. అది కూడా కాన్సర్ వచ్చేందుకు ఛాన్స్ ఇచ్చేదే. రోజూ 3 బాకన్ రాషెర్స్ తిన్నా… కాన్సర్ వచ్చే ప్రమాదం 20 శాతం పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.
2. డయాబెటిస్ సమస్య తగ్గుతుంది : మొక్కల ఆధారిత ఆహారం తినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గడమే కాదు… ఒక్కోసారి ఆల్రెడీ ఉన్న డయాబెటిస్ కూడా తగ్గుతోందని చాలా పరిశోధనల్లో తేలింది. ఎప్పుడైతే ఫాస్ట్ ఫుడ్ మానేస్తారో… అప్పటి నుంచీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి క్రమ పద్ధతిలో ఉంటోందని తెలిసింది. పండ్లు, కూరగాయలు, గింజలు తింటూ ఉంటే… టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 60 శాతం తగ్గుతున్నాయి.
3. డిప్రెషన్ తగ్గిపోతుంది : జనరల్‌గా ఈ రోజుల్లో టెన్షన్లు, ఒత్తిళ్ల వల్ల చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. ఐతే… వేగాన్ ఫుడ్ తినేవారికి డిప్రెషన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయని… 3486 మందిపై ఐదేళ్లకు పైగా PCRM జరిపిన పరిశోధనలో తేలింది. ఇందుకు కారణం ఏంటంటే… వెజిటేరియన్ ఫుడ్ తినేవారిలో పాజిటివ్ మూడ్ ఎక్కువగా ఉంటోంది.

Leave A Reply

Your email address will not be published.