Leading News Portal in Telugu

Gut Healthy: సమయానికి నిద్రపోవడం లేదా? ఈ ప్రమాదకరమైన సమస్య వచ్చే ఛాన్స్ ఉంది..! – Telugu News | Health Tips: These Side effects of not getting enough sleep; Check Here for more details


నిద్ర లేకపోవడం, సరిగా నిద్రపోకపోవడం మొత్తం ఆరోగ్యానికి హానికరం. అందుకే ప్రతి రోజూ కనీసం 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకుల ప్రకారం.. నిద్ర విధానాలలో చిన్న క్రమరాహిత్యాలు కూడా జీవక్రియను ప్రభావితం చేస్తాయి. ఈ పరిశోధన బృందంతో సీనియర్, డాక్టర్ వెండీ హాల్ ప్రకారం నిద్రకు అంతరాయం, రాత్రి వేళ పని చేయడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది జీర్ణ క్రియను నెమ్మదింపజేస్తుంది. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతాయి..

మనం అనుసరించే రోజువారి దినచర్యే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. ఆరోగ్యం బాగుండాలంటే.. జీవనశైలి కూడా బాగుండాలి. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుత కాలంలో ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా నేడు పెద్దవారి కంటే యువతలోనే చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో ముఖ్యమైనది నిద్ర. దినచర్యలో నిద్రకు సరైన సమయం లేకపోతే, అది నేరుగా మీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల పేగులో హానికరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. ఈ రకమైన బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇక అవి కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాను కూడా తగ్గిస్తాయని పరిశోధకులు నిర్ధారించారు.

పరిశోధకుల ప్రకారం.. నిద్ర, మేల్కొనే సమయానికి మధ్య 90 నిమిషాల గ్యాప్ మైక్రోబయోమ్‌ను ప్రభావితం చేస్తుంది. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు అంటున్నారు. నిద్ర లేమి సమస్య ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం..

నిద్ర లేకపోవడం, సరిగా నిద్రపోకపోవడం మొత్తం ఆరోగ్యానికి హానికరం. అందుకే ప్రతి రోజూ కనీసం 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకుల ప్రకారం.. నిద్ర విధానాలలో చిన్న క్రమరాహిత్యాలు కూడా జీవక్రియను ప్రభావితం చేస్తాయి. ఈ పరిశోధన బృందంతో సీనియర్, డాక్టర్ వెండీ హాల్ ప్రకారం నిద్రకు అంతరాయం, రాత్రి వేళ పని చేయడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది జీర్ణ క్రియను నెమ్మదింపజేస్తుంది. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతాయి.

అంతేకాదు.. నిద్రలేమి సమస్య కారణంగా పేగుల్లో చెడు బ్యాక్టీరియా పెరుగుతుందని పరిశోధకులు కనిపెట్టారు. నాణ్యత లేని ఆహారం, జంక్ ఫుడ్స్ ఊబకాయం, కార్డియోమెటబోలిక్, గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతాయి. గట్‌లో మంచి బ్యాక్టీరియా లేకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇది అనేక వ్యాధులకు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక నిద్రలేమి కారణంగా శరీర బరువు పెరిగే ప్రమాదం ఉంది. అధిక బరువుతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. రోజంతా నిరుత్సాహంగా ఉండటం, నిస్సత్తువగా ఉంటుంది. నిద్రలేమి సమస్య జ్ఞాపకశక్తిపైనా ప్రభావం చూపుతుందంటున్నారు పరిశోధకులు. మెదడు పనితీరు నెమ్మదిస్తుందని చెబుతున్నారు.

ఈ సమస్యలు రావొద్దంటే..

ఊబకాయం, గుండెపోటు, అధిక కొలెస్ట్రాల్, జీర్ణక్రియ సరిగా ఉండాలంటే అన్నింటికి మెడిసిన్ సరైన నిద్ర అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. అలాగే, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు. సరైన జీవనశైలితోనే సరైన ఆరోగ్యం ఉంటుందని హితవుచెబుతున్నారు పరిశోధకులు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..