Kombucha drink for heart health: కొంబుచా టీ పానీయం రెండు వేల సంవత్సరాల నాటిది. కొంబుచా మొదట చైనాలో తయారు చేయబడింది. ఇది తరువాత జపాన్, రష్యాకు వ్యాపించింది. 20వ శతాబ్దంలో యూరప్ దేశాలతో పాటు అమెరికాలోనూ విశేష ఆదరణ పొందింది. కొంబుచా ఈస్ట్, బ్యాక్టీరియా.. చక్కెర నుండి తయారు చేస్తారు. ఈ టీలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఇప్పుడు చాలా మంది ఈ టీ తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. కొంబుచా టీ ఎలా తయారు చేయాలి, ఆరోగ్య ప్రయోజనాలు. కొంబుచా టీని తయారు చేయడానికి ఈస్ట్, చక్కెర.. బ్లాక్ టీని ఉపయోగిస్తారు. మిశ్రమం కొన్ని వారాల పాటు పులియబెడతారు. దీనిని కిణ్వ ప్రక్రియ అంటారు. ఇందులోని కొన్ని రకాల ఈస్ట్.. బాక్టీరియా ఆమ్లాలను విడుదల చేసి పైన పొరను ఏర్పరుస్తాయి. ఈ పొరను పక్కన ఉంచి లోపల పానీయం తాగుతారు. ఈ పొరను కొంబుచా అని పిలుస్తారు. ఇది తియ్యటి ఆల్కహాల్ మాదిరి రుచిని కలిగి ఉంటుంది.
ఎలా చేసుకోవాలి..?
రెండు కప్పుల నీళ్లలో ఒకటిన్నర కప్పుల పంచదార వేసి స్టవ్ మీద పెట్టాలి. పంచదార బాగా కరిగిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల బ్లాక్ టీ వేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత అందులో ఒక కప్పు వెనిగర్ వేయాలి. మనం తయారుచేసిన కొంబుచాను ఒక పొరలో వేసి, దాదాపు 15 నుండి 20 రోజుల పాటు చల్లని పొడి ప్రదేశంలో ఉంచండి. కొంబుచా పానీయం ఎంత ఎక్కువసేపు నిల్వ ఉంటే, అది తియ్యగా మరియు రుచిగా ఉంటుంది. మీరు దీన్ని రోజూ తాగవచ్చు.
ఈ టీలో ఉండే ప్రోబయోటిక్స్ మన జీర్ణాశయం మరియు ప్రేగులలో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతాయి. ఇది జీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. కడుపు మరియు ప్రేగులలోని సూక్ష్మజీవులు నాశనమవుతాయి. రోజూ కొంబుచా టీ తాగడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయని పరిశోధనలో వెల్లడైంది. కొంబూచా టీ తాగితే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
గ్రీన్ టీ లాగా, కొంబుచా టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులను నివారిస్తుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఈ కంబూచాలోని బ్యాక్టీరియా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ రోగులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ కొంబుచా పానీయం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. జార్జ్‌టౌన్ యూనివర్శిటీ నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ఈ కొంబుచా డ్రింక్ తీసుకున్న నాలుగు వారాల తర్వాత, సబ్జెక్ట్‌ల యొక్క సగటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు డెసిలీటర్కు 164 నుండి 116 మిల్లీగ్రాములకు తగ్గాయని వెల్లడించింది. కొంబుచా టీలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
Hrithik Roshan: ఎవర్రా టామ్ క్రూజ్… మా హృతిక్ ని చూడండి ఒకసారి