Leading News Portal in Telugu

Health Tips: రాత్రిపూట వీటిని తింటున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్లే..


రాత్రి పూట తీసుకొనే ఆహారం ఎంతగా ప్రభావితం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా కూడా రాత్రి తీసుకొనే ఆహారం పై ఆధారపడి ఉంటుంది.. రాత్రి పూట కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పొద్దున్నే ఆఫీసుకు వెళ్లే హడావుడి, పని ఒత్తిడి వలన చాలామంది సరైన భోజనం చేయలేకపోతారు. అలాంటివారు రాత్రి తమకి నచ్చిన భోజనం చేయడానికి ఇష్టపడతారు కానీ చాలా ఆహార పదార్థాలు రాత్రిపూట తినకూడదు. వీటివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి.. రాత్రిపూట మనం తినకూడని ఆహారం ఏమిటో చూద్దాం. రాత్రిపూట హెవీగా ఉండే ఆహార పదార్థాలు అంటే ఫ్రైడ్ ఫుడ్స్, బర్గర్స్ ఇలా హెవీ గా ఉండే ఆహార పదార్థాలని తీసుకోవడం వలన డైజేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది..

నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా తీసుకోకూడదు. అంటే పుచ్చకాయ, కీరదోస అలాంటివి. దానివల్ల పెద్ద వయసు వారు అర్ధరాత్రి పూట నిద్ర లేవాల్సి వస్తుంది. అలాగే బాగా స్పైసీగా ఉండే ఆహార పదార్థాలు కూడా రాత్రిపూట అవాయిడ్ చేయటం చాలా మంచిది.. రాత్రిళ్ళు టమాటా కూడా ఎక్కువగా తినకూడదు ఇది త్వరగా అరగదు ఇందులో ఉండే విటమిన్ సి జీర్ణం అవ్వటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే కాఫీలు టీలు కూడా రాత్రిపూట అసలు తీసుకోకూడదు.. ఇక క్యాబేజీ క్యాలీఫ్లవర్ కూడా రాత్రిపూట తీసుకోకూడదు ఇందులో ఉండే అధిక ఫైబర్ త్వరగా జీర్ణం అవ్వదు దీనివలన మీకు సరైన నిద్ర ఉండదు. అలాగే సెట్ డ్రస్ జ్యూస్ పచ్చి ఉల్లిపాయలు వైట్ వైన్ టమాటో సాస్ వంటి వాటిని రాత్రి పూట తినకూడదు.. లైట్ గా అరిగే వాటిని ఎక్కువగా తీసుకోవాలి.. అలాగే త్వరగా అంటే నిద్ర పోవడానికి రెండు గంటల ముందు తీసుకోవడం మంచిది..