ఈ మధ్య కాలంలో ఎక్కువగా గ్రీన్ టీని తాగుతున్నారు.. గ్రీన్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో ఎక్కువ మంది తాగుతున్నారు.. గ్రీన్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్పటంతో అందరూ గ్రీన్ టీని త్రాగటం ప్రారంభించారు.. ఇక గ్రీన్ టీ వల్ల కలిగే లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అధిక బరువు సమస్యతో బాధపడేవారు, బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడేవారు,అందమైన మెరిసే చర్మం కావాలని అనుకునేవారు, ఎప్పుడు ఉషారుగా ఉండాలని అనుకునేవారు, మెటబాలిజం బాగుండాలని అనుకునేవారు గ్రీన్ టీ త్రాగవచ్చు. అయితే గ్రీన్ టీని త్రాగటానికి సమయం ఉంటుంది. అలాగే సరైన పరిమాణంలో మాత్రమే త్రాగాలి. నీటిని త్రాగినట్టుగా ఒక కప్పు తర్వాత మరో కప్పు త్రాగకూడదు. ఇలా త్రాగితే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని చాలా మంది భావిస్తారు. అయితే అది తప్పు. గ్రీన్ టీని సరైన సమయంలో త్రాగకపోతే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి గ్రీన్ టీ త్రాగే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గ్రీన్ టీలో కెఫీన్,టానిన్స్ ఉంటాయి..
ఈ టీ గ్యాస్ట్రిక్ జ్యూస్ మీద ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావం కారణంగా వికారం,పొట్టలో ఎసిడిటి సమస్య,గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తాయి. అందువల్ల గ్రీన్ టీని సరైన సమయంలో సరైన పరిమాణంలో తీసుకుంటే అందులోని ప్రయోజనాలు అన్ని శరీరానికి అందుతాయి. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువ పరిమాణంలో తీసుకోవటం వలన మన ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తుంది..గ్రీన్ టీలో తేనే కలుపుకొని త్రాగవచ్చు. తేనెలో ఉండే విటమిన్స్ ఫ్యాట్ కరిగించటానికి,కేలరీలు బర్న్ చేయటానికి సహాయపడుతుంది. గ్రీన్ టీ మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ త్రాగకూడదు. భోజనం చేసిన వెంటనే త్రాగితే గ్రీన్ టీలో ఉండే కెఫీన్ జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతుంది. రోజుకి రెండు కప్పుల గ్రీన్ టీని మాత్రమే తాగాలని నిపుణులు చెబుతున్నారు..