అధిక బరువు సమస్య ఈరోజుల్లో అందరిని వేదిస్తున్న ప్రధాన సమస్య.. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు.. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం, అవసరానికి మించి ఆహారాన్ని తీసుకోవడం ఇలా అనేక కారణాల చేత అధిక బరువు సమస్య తలెత్తుతుంది. అధిక బరువు కారణంగా మనలో చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు.. అనేక రకాల సమస్యలు వస్తాయి.. అధిక బరువును తగ్గించే అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాము అదేంటో ఒకసారి చూడండి..
సాదారణంగా అధిక బరువు వల్ల వల్ల గుండె జబ్బులు, బీపీ, షుగర్, హార్మోన్ల అసమతుల్యత ఇలా అనేక రకాల ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక మనం సాధ్యమైనంత వరకు చాలా త్వరగా అధిక బరువు సమస్య నుండి బయటపడాలి.. ముఖ్యంగా డ్రెస్సులు కూడా వేసుకోలేరు.. ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..
ఎంత బరువున్నా కూడా వెంటనే కరిగించే ఈ పొడిని ఎలా తయారు చెయ్యాలంటే.. అవిసె గింజలను, అర కప్పు జీలకర్రను, పావు కప్పు సోంపు గింజలను, ఒక కప్పు కరివేపాకును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక కళాయిలో ఈ పదార్థాలన్నింటిని వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ మోతాదులో కలిపి తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది.. ఈ పొడిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు కనుక అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను ప్రయత్నించండి..