మనిషి జీవితం డబ్బును సంపాదించడనికే టైం సరిపోతుంది.. ఇకపోతే మనిషికి ఆశ ఎక్కువే.. ఎంత సంపాదించిన తృప్తి ఉండదు.. మనిషి కోరికల వెంట పరుగులు తీస్తూనే ఉంటాడు. అలాగే ఆనందాన్ని కూడా కోల్పోతాడు. దానికి ఉదాహరణగా ఇప్పుడు ఒక కథను చెప్పుకుందాం..
ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్తాడు. కానీ గుర్రానికి సరైన భేరం దొరకదు. దీంతో ఆ గుర్రాన్ని ఇచ్చి ఆవును తీసుకుంటాడు. మరి ఒకరి సలహాతో గుర్రం నుంచి గాడిదలను తీసుకుంటాడు.చివరికి గాడిదను ఇచ్చి బూట్లు తీసుకుంటాడు.బూట్లు ఇచ్చి చివరకు ఒక టోపీని తీసుకుంటాడు..ఆ టోపీ పెట్టుకుని దారిలో వంతెన మీద నడుస్తూ వస్తుంటాడు. ఆ టోపీకి నదిలో పడుతుంది.. దానికి బాధపడుతూ వస్తాడు.. దారిన పోయే ఇద్దరు అడుగుతారు.. ఇంట్లో నీ పెళ్ళాం ఇక తాండవం చేస్తుంది అని నవ్వు కుంటారు..
దీంతో వారిద్దరు కూడా వేటగాడు ఇంటికి వెళ్తారు. వెంటనే గుమ్మంలో నుంచి భార్యను పిలుస్తాడు. అతడి పెళ్ళాం ఎదురుగా వచ్చి బావ వచ్చావా అని ఆప్యాయంగా పలకరిస్తుంది. అతడు జరిగింది అంతా చెప్పడం మొదలు పెడతాడు. దీంతో గుర్రం ధర పలకకపోతే ఆవును తీసుకున్నా అంటాడు.దీంతో మంచి పని చేశావు పాలు తాగొచ్చు అంటుంది. ఆ తర్వాత ఆవును కాదని గాడిదను తీసుకున్న అని వేటగాడు ఉంటాడు. దీంతో అడవి నుంచి కట్టెలు మోసుకు వస్తుంది లేండి అంటుంది.భార్య గాడిద ను అమ్మి చెప్పులు తీసుకున్నా అంటాడు. అడవిలో రాళ్లు రప్పలు తగలకుండా ఉంటుంది అని భార్య చెబుతుంది.. చివరికి టోపీ తీసుకున్న అని చెప్పాడు.. పోనిలే అని చెపుతుంది.. అది నదిలో పడిందని చెబుతాడు.. పోనిలే మీరు పడలేదు అంటుంది.. పోతే పోయింది నువ్వు పడలేదు అంతా అడవి తల్లికి దయ అంటుంది.గుర్రాన్ని నష్టపోయి వచ్చినందుకు భర్తను ఒక్క మాట కూడా అనకుండా భర్త క్షేమంగా ఇంటికి వచ్చినందుకు అడవి తల్లికి ధన్యవాదాలు చెప్పింది.ఆమె మంచి మనసు చూసి ఆ ఇద్దరు సిగ్గుతో వెనక్కి వెళ్లిపోయారు.. నిజంగా ఇలా భార్య ఉంటే ఎవరు కాదంటారు.. అదృష్టవంతులే కదా..