ఒకవైపు వర్షాలు, మరో వైపు కొత్త కొత్త వ్యాదులు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి.. పిల్లలకు కూడా కొత్త వ్యాదులు సంక్రమిస్తున్నాయి.. వైరల్ ఫీవర్, దగ్గు, జలుబు, ఇతర జ్వరాలు వస్తుంటాయి. వీటన్నింటి నుంచి తట్టుకోవాలంటే.. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచాలి. ఇందుకు గాను కింద తెలిపే చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని పాటించడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో వారు రోగాల బారిన పడకుండా ఉంటారు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పిల్లలకు బ్లూబెర్రీలు, రాస్ప్‌బెర్రీలు, బ్లాక్‌బెర్రీలు, స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలను ఆహారంగా ఇవ్వాలి. ఇవి అనేక పోషకాలను, ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను అమాంతం పెంచుతాయి. అలాగే పొద్దు తిరుగుడు, గుమ్మడి విత్తనాలు, నువ్వులు, చియా సీడ్స్ వంటి విత్తనాలను కూడా పిల్లలకు రోజూ ఇస్తుండాలి. వీటిల్లో ఫైబర్, పాలీ అన్‌శాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఇతర సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి..
పెరుగును కూడా రెగ్యులర్ గా ఇస్తూ ఉండాలి.. జీర్ణవ్యవస్థలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. ఇది ఆరోగ్యాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది. పెరుగును తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో సిట్రస్ ఫ్రూట్స్ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. పుల్లగా ఉండే గ్రేప్ ఫ్రూట్, ద్రాక్ష, నారింజ, బత్తాయి, నిమ్మ, కివీ, దానిమ్మ.. వంటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే జామకాయల్లోనూ ఈ విటమిన్ అధికంగానే ఉంటుంది.. అలాగే రోజూ పిల్లలకు ఒక కోడిగుడ్డును ఉడకబెట్టి ఇవ్వాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది. కోడిగుడ్లలో విటమిన్ డి, విటమిన్ ఎ, బి12 అధికంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచి రోగాలు రాకుండా చూడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.. పాలల్లో అప్పుడప్పుడు పసుపు వేసి ఇవ్వడం కూడా మంచిదే..