Leading News Portal in Telugu

Health Tips : నిమ్మతోక్కలను పడేస్తున్నారా? ఇది తెలిస్తే అస్సలు పడేయ్యరు..


నిమ్మకాయల్లో విటమిన్ c అధికంగా ఉంటుంది.. అందుకే నిమ్మరసం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.. నిమ్మకాయల్లో మాత్రమే కాదు.. తొక్కల్లో కూడా పోషక విలువలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..తొక్కల్లో C విటమిన్‌తోపాటూ.. కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. అందుకే నిమ్మ తొక్కలను మనం పారేయకుండా.. జుట్టు, చర్మానికి, ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇమ్యూనిటీని పెంచడానికి కూడా అవి ఉపయోగపడతాయి.. ఈ తొక్కల్లో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

*. నిమ్మతొక్కలతో చర్మంపై రుద్దుకుంటే.. మురికి చాలా వరకు వదిలిపోతుంది. చర్మం నిగనిగలాడుతుంది. అందుకే చాలా కాస్మెటిక్ ఉత్పత్తులు, సబ్బుల తయారీలో నిమ్మతొక్కలను వాడుతారు..
*. నిమ్మ తొక్కల పొడిని రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే.. రక్త నాళాలలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. తద్వారా రక్త ప్రసరణ పద్ధతిగా సాగుతుంది. దాంతో.. రక్తపోటు అనేది సజావుగా సాగుతుంది. హెచ్చుతగ్గులు పెద్దగా ఉండవు. అంతేకాదు.. నిమ్మ తొక్కల పొడిలోని పొటాషియం ఎక్కువగా ఉంటుంది.. బిపిని కంట్రోల్లో ఉంచుతుంది..
*. ఇటీవల కాలంలో చాలా మంది గుండె జబ్బులతో చనిపోతున్నారు. అందుకు కారణాల్లో ఒకటి కొలెస్ట్రాల్ అని తెలుస్తోంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించడంలో.. నిమ్మ తొక్కలలోని పాలీఫెనాల్ ఫ్లేవనాయిడ్స్ పనిచేస్తాయి..
*. కొంతమంది నుంచి తరచూ చెడు వాసనలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు స్నానం చేసే ముందు.. నిమ్మ తొక్కలతో చర్మంపై రుద్దుకుంటే.. స్నానం తర్వాత చెడు వాసనలు అంతగా రావు. అలాంటి వాసన తెప్పించే.. బ్యాక్టీరియాను నిమ్మ తొక్కలు చంపేస్తాయి..
*. ఇక ఈ తొక్కల వాసన పీల్చితే.. మనలో టెన్షన్లు తగ్గుతాయి. నిరాశ, నిస్పృహలో ఉండేవారు నిమ్మ తొక్కల వాసన చూడాలి. అంతేకాదు.. ప్రయాణాల్లో వాంతి చేసుకునేవారు.. నిమ్మ తొక్కల వాసన పీల్చుతూ ఉంటే.. వాంతి రాదు.. ఇంక తలనొప్పి కూడా రాదు..
క్యాన్సర్ వంటి ప్రాణంతకమైన వ్యాధుల నుంచి కూడా ఈ తొక్కలు కాపాడుతాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చెయ్యండి..