Leading News Portal in Telugu

Lifestyle : మగవాళ్ళు ఈ తప్పులు చేస్తే ఆడవారికి అస్సలు నచ్చవట..ఎందుకంటే?


మగవాళ్ళు ఆడవాళ్లు తమను ఇష్టపడాలని కోరుకుంటారు.. ఆడవాళ్లు ఇష్ట పడేలా ఉండాలని తెగ ప్రయత్నాలు చేస్తారు.. అన్నిటికన్నా ముఖ్యంగా ఆడవాళ్ళ ఇష్టాలను తెలుసుకుంటారు.. వారిని మనసును గెలుచుకొనే ప్రయత్నం చేస్తారు..తమని ఇష్టపడాలని మగవారు ఎక్కువగా కోరుకుంటారు. అయితే, అలా ఇష్టపడాలంటే వారికి నచ్చిన పనులు చేసి ఇంప్రెస్ చేస్తారు.. ఇప్పుడు మనం ఆడవాళ్లకు ఎలాంటి పనులు చేస్తే మగవారిని ఇష్టపడతారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆడవాళ్లు ఆశా జీవులు అని పెద్దలు ఊరికే అనలేదు.. భర్తల విషయంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు.. ఎవరితో ఉండకూడదు.. నా భర్త నాకే సొంతం అనుకుంటారు.. నలుగురిలో ఉన్నా వారినే ప్రత్యేకంగా చూడాలని కోరుకుంటారు. అలా కాకుండా వేరేవారికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే అస్సలు తట్టుకోలేరు.. అందుకే వారిని ఇలాంటి విషయాల్లో ఇంప్రెస్స్ చెయ్యడం మంచిది..

భార్యల విషయంలో ఎప్పుడు ఏ విషయంలో తొందర పడవద్దు.. రొమాంటిక్ జోక్స్, రొమాంటిక్‌గా మాట్లాడడం, అలాంటి ఫొటోలు, వీడియోలు పంపడం అస్సలు నచ్చదు గుర్తుపెట్టుకోండి. కాబట్టి, అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.. వాళ్లకు ఎలా ఇష్టమో అలా చేస్తే ఇక మగాడికి స్వర్గమే గుర్తు పెట్టుకోండి..

మాట ఇచ్చి తప్పడం మంచిది కాదు.. ఆడవాళ్లు ఇలాంటి విషయాలు ఎక్కువగా పట్టించుకుంటారు.. తనకి మాట ఇస్తే వాటిని ఎప్పుడు కూడా అస్సలు మార్చొద్దు. అలా కాకుండా వారిని మోసం చేయడం మోసగించడం చేస్తే వారికి మీపై కోపం వస్తుంది.. అపద్దాలు ఎట్టి పరిస్థితులలో చెప్పకండి తట్టుకోలేరు.. అలాగే తన ఇష్టమైన వాటి విషయంలో మాట తప్పితే ఇక మిమ్మల్ని దూరం పెట్టేస్తారు..

ఈ మధ్యకాలంలో మహిళలు కాస్తా స్మార్ట్ అయ్యారు. వారిని ఎంత బుజ్జగించి, అంతో కొంత బతిమాలితేనే వారికి నచ్చుతుంది. అందుకే మొండిగా ఉండకుండా వారిని బుజ్జగిస్తే చాలు ఇక మీకు ప్రతి రాత్రి తొలిరాత్రే.. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు..

ఏవైనా విషయాలు పంచుకోవాలని, వారి సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని ప్రతి మహిళ అనుకుంటుంది. అలా వారిని అర్థం చేసుకోకుండా, మాట్లాడకుండా ఉంటే మీరు ఆమె దృష్టిలో వెనక్కిపడిపోయినట్లే. చాలా మంది ఆడవారు మగవారిని తిరస్కరించడానికి ఇలాంటి చిన్న విషయాల గురించి తెలుసుకోవడం మంచిది.. మనమే ప్రపంచం అని వచ్చిన వారికి కాస్త ప్రేమను చూపించగలిగితే స్వర్గం కళ్ల ముందే ఉంటుంది.. అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి.. ఇదండి.. గుర్తుంచుకోండి..