Leading News Portal in Telugu

Health Tips : రోజూ ఒక స్పూన్ వెన్న తీసుకుంటే చాలు.. ఆ సమస్యలు అన్నీ దూరం..


వెన్నలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. రోజు తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.. ఈ వెన్నలో విటమిన్ ఎ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది..వె న్నలో విటమిన్ ఎ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అలాగే వెన్నలో కాల్షియం కూడా ఉంటుంది. ఈ కాల్షియం మన ఎముకలు, దంతాల ఎదుగుదలకు, బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. వెన్న తీసుకోవడం వల్ల కలిగే లాభలెమిటో ఒకసారి తెలుసుకుందాం..

ఈ వెన్నలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే వెన్నను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. వెంట్రుకలు బలంగా అవుతాయి. చర్మం తేమగా ఉంటుంది.

మలబద్దకాన్ని నివారించడానికి వెన్న ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున వెన్న తీసుకోవడం వల్ల మలబద్దకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు..

చర్మ సంరక్షణకు కూడా వెన్న ఎంతో సహాయపడుతుంది. ప్రతిరోజూ కొద్దిగా వెన్నను ముఖానికి రాసుకుంటే ముఖంపై నల్లటి మచ్చలు తొలగిపోతాయి. పగిలిన పదాలకు రోజూ కొద్దిగా వెన్నను అప్లై చేయడం వల్ల పగుళ్లు తగ్గుతాయి.. ఇక పెదాలు మృదువుగా మారడానికి కూడా సహాయ పడతాయి..

అదేవిధంగా పీరియడ్స్ సమయంలో కొంతమందికి విపరీతమైన కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ సమయంలో వెన్నను తీసుకోవడం వల్ల నెలసరి నొప్పి, ఉబ్బరం, తిమ్మిరి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..పాలిచ్చే తల్లులు కూడా ప్రతిరోజూ కొద్దిగా వెన్న తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇది మీ పాల ఉత్పత్తిని పెంచుతుంది.. ఇంకా పిల్లలకు కూడా వెన్న పెట్టడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.. ఇంకా ఎన్నో సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు..