Drinking Lemon Water: ప్రతి ఉదయం నిద్రలేవగానే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే చాలా మంచిదని అంటూ ఉంటారు. ఇక మనలో చాలా మందికి కూడా గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె వేసుకొని తాగే అలవాటు ఉంటుంది. రోజూ గోరువెచ్చని నీటితో కలిసి నిమ్మరసం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో తగిన పరిమాణంలో నీటి శాతాన్ని ఉంచడానికి నిమ్మనీరు ఉపయోగపడుతుంది.
చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, జీవక్రియలు చురుగ్గా పని చేయడానికి ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సీ జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీని వల్ల తిన్న ఆహారం మంచిగా అరుగుతుంది. కాబట్టి కడుపుబ్బరం, అజీర్ణం సమస్యలు తొలగిపోతాయి. శరీరంలో చెడు కొవ్వులు కరిగిపోవడానికి విటమిన్ సీ ఉపయోగపడుతుంది. అందుకే నిమ్మరసంలో ఎక్కువ విటమిన్ సీ ఉంటుంది కాబట్టి చెడు కొలిస్ట్రాల్ తగ్గిపోయి బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. గుండె సమస్యలు రాకుండా, రక్తపోటు పెరగకుండా కూడా నిమ్మరసం చేస్తుంది. అంతే కాకుండా నోటికి సంబంధించిన సమస్యలకు కూడా ఈ విటమిన్ సీ చెక్ పెడుతుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలను నిమ్మలోని విటమిన్ సీ నివారిస్తుంది. అంతేకాకుండా ఈ రసం శరీరంలోని పీహెచ్ స్థాయిలను నియంత్రిస్తుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న నిమ్మరసం వల్ల కూడ కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. వాటిలో ఒకటి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం. మూత్రంలో సిట్రేట్ స్థాయిలు పెరగడం వల్ల రాళ్లు ఏర్పడతాయి. దీనితో పాటు నిమ్మలో ఎక్కువగా ఉండే యాసిడిక్ నేచర్ పళ్లపై ఉండే ఎనామిల్ ను దెబ్బ తీస్తుంది. దీంతో పళ్లరంగు మారడంతో పాటు పళ్లు బలహీన పడతాయి. అందుకే నిమ్మరసాన్ని ఎప్పుడూ నీటితో కలిపే తీసుకోవాలి. ప్రయోజనాలు ఎన్ని ఉన్నా కూడా అతిగా తీసుకుంటే ఏదైనా అనర్థదయకమే. ఎక్కువైతే దేనికైనా సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. అందుకే నిమ్మ సరైన ప్రయోజనాలు పొందాలంటే రోజుకు ఒకటి రెండు గ్లాసుల నిమ్మనీరు తాగడం మంచిది. ఇక ఆస్తమా, త్వరగా జలుబు బారిన పడేవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.