Leading News Portal in Telugu

Health Tips : దగ్గు, గొంతునొప్పి ఇబ్బంది పెడుతున్నాయా?.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..


వర్షాకాలం, చలికాలం అంటే దగ్గు, జలుబు కామన్.. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవి వస్తాయి.. ఒకసారి వస్తే తగ్గడం కూడా కష్టమే..మందులకు అస్సలు తగ్గవు.. ఇక దగ్గు జలుబు తగ్గాలంటే మన ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి… ఇంటి చిట్కాలతో ఎలా జలుబు, దగ్గును తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మారిన వాతావరణం వల్ల గానీ,సరైన పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల గానీ, పని ఒత్తిడి వల్లగానీ ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.ప్రతి ఆరోగ్య సమస్యకు మందులు వాడడం వలన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాకాకుండా మనకు ప్రకృతిలో దొరికే సహజసిద్దమైన మన ఇంట్లోనే లభించే కొన్ని పదార్దాలను ఉపయోగించి ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు..దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయం మూడు కప్పుల నీళ్లల్లో రెండు తమలపాకులు, నాలుగు మిరియాలు వేసి సగం అయ్యేవరకు నీటిని మరిగించి అందులో ఒక టీస్పూను తేనె కలుపుకుని తాగాలి..

దానిమ్మ తొక్కలను పొడి చేసి ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూను పొడి కలిపి తీసుకుంటే రక్త శుద్ది జరుగుతుంది.. తులసి ఆకులను తేనెను కలిపి తీసుకున్నా మంచి ఉపశమనం కలుగుతుంది.. ఉప్పు నీరు ఒక యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ ద్రావణంగా పనిచేసి శ్లేష్మం క్లియర్ చేయటానికి సహాయపడి గొంతు అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది.. వెచ్చని నీళ్లను తీసుకోవడం వల్ల గొంతు సమస్యలు కూడా తగ్గిపోతాయి.. అలాగే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.. అల్లం టీ కూడా మంచిదే.. మీరు ఒక్కసారి ట్రై చెయ్యండి.. రిజల్ట్ మీకే తెలుస్తుంది..