
Mumbai: ముంబైలో ఒక బాలుడికి చాలా అరుదైన ఆరోగ్య పరిస్థితి ఏర్పడింది. ఒకే సారి డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పిరోసిస్ వ్యాధులు ఎటాక్ అయ్యాయి. కుర్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి ఈ మూడు వ్యాధులు ఒకేసారి సోకాయి. ఈ నెల ప్రారంభంలో బాలుడికి జ్వరం వచ్చింది. వైద్యుడిని సంప్రదించకపోగా.. స్థానికంగా ఉండే ఓ మామూలు వైద్యుడి వద్ద వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు.
Read Also: chandrayaan-3: ప్రమాదాల నుంచి ప్రజ్ఞాన్ రోవర్ ఎలా తప్పించుకుంటుందో చూడండి.. ఇస్రో లేటెస్ట్ వీడియో..
ఎంతకు ఆరోగ్య పరిస్థితి మెరుగపడకపోవడంతో ఆగస్టు 14న కస్తూర్బా ప్రభుత్వం ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యుల పరీక్షల్లో డెంగ్యూ, మలేరియాతో పాటు ఆశ్చర్యకరంగా లెప్టోస్పిరోసిస్ అనే ఇన్ఫెక్షన్ కూడా బయటపడింది. దీంతో బాలుడి పరిస్థితి విషమించడంతో ముంబై సెంట్రల్ లోని నాయర్ ఆస్పత్రికి తరలించారు.
తీవ్రమైన లంగ్స్ సమస్యలతో బాలుడికి వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందించారు. తీవ్రశ్వాశకోశ సమస్యలతో బాధపడుతున్న బాలుడి, క్రియాటినిన్ లెవల్స్ కూడా పడిపోయాయి. దీంతో బాలుడి ఒక్కొక్క అవయవం ఫెయిల్ అవుతూ.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి కారణం అయింది. డాక్టర్లు ఎంతగా ప్రయత్నించిన బాలుడిని రక్షించలేకపోయారు. ఆస్పత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత బాలుడు మరణించాడు. ఇలా మూడు వ్యాధులు ఒకేసారి సోకడం అసాధ్యం కాదని.. అయితే చాలా అరుదని డాక్టర్లు పేర్కొన్నారు. ముందుగా వస్తే బాలుడిని కాపాడే వారమని తెలిపారు.