అందంగా ఉండాలని అందరు అనుకుంటారు.. అందంలో భాగంగా గోర్లు కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు.. దానికోసం అందంగా గొర్లకు రకరకాల రంగును వేసుకుంటారు.. రోజూ వేసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు.. రోజూ నెయిల్ పాలిష్ ను వేసుకుంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అయితే ఒకప్పుడు వారానికోసారి నెయిల్ పెయింట్ మార్చే రోజులు పోయి.. రోజుకి లేదా రెండు రోజులకు ఒకసారి కొత్త నెయిల్ పాలిష్ ను వేసేసుకుంటున్నారు. వేసుకున్న డ్రెస్ కి మ్యాచింగ్ గా నెయిల్ పాలిష్ ఉండాల్సిందే. నెయిల్ రిమూవర్ తో రిమూవ్ చేయడం.. పూటకో కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవడం. కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లే యువతులు వీటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.. సినిమాలు, సీరియల్స్ నటించేవాళ్ళు ఎక్కువగా ఈ గోర్ల రంగును వాడుతున్నారు..
గోర్లు మరింత అందంగా కనిపించాలని రకరకాల పెయింట్స్ ను వేసుకుంటారు.. నెయిల్ ఆర్ట్ ను కూడా వేస్తారు..కానీ నెయిల్ పాలిష్ లను ఎక్కువగా వాడితే.. అనారోగ్యం బారిన పడతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.. తాజాగా జరిపిన పరిశోధనల్లో సంచలన విషయాలను బయటపెట్టారు..నెయిల్ పాలిష్ ఎక్కువగా వాడటం వల్ల బరువు పెరుగుతారని నిర్థారణ అయింది. నెయిల్ పెయింట్ లో ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనం ఉంటుంది. ప్లాస్టిక్, ఫామ్ ఫర్నీచర్ కు మంటలు అంటుకోకుండా ఉండటానికి ఈ రసాయనాన్ని వాడుతారు. ఎక్కువ రోజులు పాలిష్ గా ఉండేందుకు నెయిల్ పెయింట్ లోనూ ఈ రసాయనాన్ని కలుపుతారు. ఇది శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.. నెయిల్ పాలిష్ లను వేసుకున్న 10 గంటలోపే టీపీహెచ్ పీ పెరిగి బరువు పెరిగే అవకాశాలున్నట్లు తెలిపారు. డైరెక్ట్ గా గోళ్లకు కాకుండా.. ఆర్టిఫిషియల్ నెయిల్స్ కి పెట్టుకుని అతికించుకుంటే దుష్ప్రభావాలు ఉండవు.. సో ఇలా ట్రై చెయ్యండి.. అందం ఆరోగ్యం కూడా..