Leading News Portal in Telugu

Health Tips: చేపలు తిన్న తర్వాత వీటిని తీసుకుంటే.. ఏమౌతుందో తెలుసా?


చేపలు ఆరోగ్యానికి మంచివే అని డాక్టర్లు చెబుతున్నారు.. ఎన్నో పోషకాలు కలిగి ఉన్న ఈ చేపలను ఎక్కువగా తీసుకోకూడదని కూడా నిపుణులు అంటున్నారు.. చేపలు తిన్న తర్వాత పాలు తాగకూడదని అలాగే పాలు తాగిన తర్వాత చేపలు తినకూడదని చిన్నప్పటినుంచి మన పెద్దలు చెబుతూ ఉంటే వింటూ వచ్చాం.. పాలను తీసుకోవడం కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చేపలను రాత్రి పూట తిన్న వెంటనే చాలా మంది పాలు తాగుతారు.. కానీ అలా చేస్తే ఫుడ్ ఫాయిజన్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఆయుర్వేదం ప్రకారం చేపలు తిన్న వెంటనే మీరు పాలు తీసుకున్నట్లయితే కొందరిలో ల్యూకోడెర్మా అనే అనారోగ్య స్థితి రావచ్చని చెబుతున్నారు… దీని ద్వారా చర్మం పై తెల్లని మచ్చలు వస్తాయని చెబుతున్నారు.. అయితే ఇది అందరిలోనూ అన్నిసార్లు కనిపించదు. కొన్నిసార్లు చేపలు అసిడిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి, పాలు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రమంలో రెండింటినీ కలిపి తీసుకుంటే ఉదర సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

ఇక డాక్టర్లు మాత్రం ఆటో యూనియన్ వ్యాధి అంటే రోగనిరోధక వ్యవస్థ మెలీనియం తో పోరాడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. యాంటీబాడీ లు దాడి చేసిన చోటల్లా చర్మంపై మచ్చలు కనిపిస్తాయి. అంతేకానీ చేపలను పాలతో కలిపి తీసుకుంటే చర్మంపై మచ్చలు రావని ప్రముఖ వైద్యులు చెబుతున్నారు.. ఇకపోతే చేపలు, పాల ఉత్పత్తులలో అధిక ప్రోటీన్లు ఉంటాయి. రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. దీనివల్ల గ్యాస్, డయేరియా తదితరులు సమస్యలు వస్తాయేమో కానీ చర్మానికి సంబంధించిన మచ్చలు లాంటివి ఎట్టి పరిస్థితుల్లో రావని నిపుణులు చెప్తున్నారు.. అయితే కొందరి చర్మానికి ఇది పడకపోవచ్చు అందుకే ఈ కాంబినేషన్స్ తీసుకోకపోవడమే బెస్ట్ అంటున్నారు నిపుణులు..