Leading News Portal in Telugu

Corn Benefits : మొక్కజొన్నను ఇలా తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు..


ఒకప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా దొరికే ఈ మొక్క జొన్నలు ఇప్పుడు ఏ కాలంలో అయిన విరివిగా లభిస్తాయి.. చాలా మంది వర్షం పడేటప్పుడు వేడి వేడిగా బజ్జీలు, సమోసాలు, టీ వంటి వాటిని తీసుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ వీటికి బదులుగా మొక్కజొన్న పొత్తులను తీసుకోవడం వల్ల రుచిగా ఉండడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మొక్క జొన్నను ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్యం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

వీటిలో ఎక్కువగా ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ ఈ, విటమిన్ బి6, థయామిన్, రైబోప్లేవిన్, నియాసిన్, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, మాంగనీస్, కాపర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న పొత్తులను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి.. చర్మం నిగారింపు ఉంటుంది..

అధిక బరువుతో బాధపడేవారికి చక్కటి పరిష్కారం పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.. వీటిని ఉడికించి కాల్చుకుని వాటిపై ఉప్పు, కారం, నిమ్మరసం వేసి తింటూ ఉంటారు. అలాగే గింజలను వేయించి తీసుకుంటూ ఉంటారు. కొందరు వీటితో గారెలను తయారు చేస్తూ ఉంటారు.. వీటిని ఉడికించి సలాడ్ రూపంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. సన్నగా వారు మొక్కజొన్న పొత్తులను తినడం వల్ల బరువు పెరుగుతారు. ఈ విధంగా మొక్కజొన్న పొత్తులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.. ఈ పొత్తులను పూర్తిగా ఉడికించిన తరువాత లేదా కాల్చుకున్న తరువాత మాత్రమే తీసుకోవాలని పచ్చిగా తీసుకుంటే కడుపునొప్పి, అజీర్తి, డయేరియా వంటి జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు..