నాన్ స్టిక్ ప్యాన్స్‌లో వండటం వల్ల అవి అంటుకోకుండా బాగా వస్తాయి.. అంతేకాదు దోశలు క్రిస్పీగా, మృదువుగా వచ్చేందుకు వాడతారు. అయితే, వీటిని వాడడం వరకూ ఓకే కానీ, కొన్ని రోజులకి వాటిపై ఉన్న లేయర్ పోయి చూడ్డానికి బాగోవు. అలాంటి ప్యాన్స్‌ని వాడకపోవడమే మంచిది. అలా అవ్వకుండా ఇవి ఎక్కువ రోజులు రావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ..
ఈరోజుల్లో ఎక్కువ మంది ఇలాంటి ప్యాన్స్‌లో వాడని వాళ్లు ఉండరు.. ఇప్పుడు అందరు ఇవే వాడుతున్నారు..వీటిని క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్లు తీసుకోవాలి. ఇతర గిన్నెల్లా వీటిని తోమకూడదు. ఇలా చేస్తే వాటిపై కోటింగ్ పోతుంది. అలా కాకుండా ఉండేందుకు కొన్ని టిప్స్‌ని ఫాలో అవ్వాలి.. లేకుంటే మాత్రం త్వరగా పాడై పోతాయని నిపుణులు చెబుతున్నారు..
*. నాన్ స్టిక్ వాడేటప్పుడు నూనె వాడొద్దొని చెబుతారు. కానీ, మీరు కొద్ది మొత్తంలో నూనెని వాడొచ్చు. కొంచెం నూనె తీసుకుని అన్ని వైపులా రుద్దాని. ఆ తర్వాత పేపర్ తీసుకుని బాగా తుడిచి దోశ కాల్చండి..
*. ఏసిడిక్ ఫుడ్స్ ను చాలావరకు వండక పోవడమే మంచిది.. ఇవి నాన్ స్టిక్ తవా బేస్‌ని నాశనం చేస్తాయి. నాన్ స్టిక్ కుక్‌వేర్‌లో అధిక ఆమ్ల ఆహారాలను వండడం మానేయండి.. అవి వాటిపై ఉండే పోరను తొలగిస్తాయి..
*. వీటిని వాడేటప్పుడు మెటల్ స్పూన్స్, కత్తులని వాడొద్దు. పదునైన కత్తులని వాడడం వల్ల నాన్ స్టిక్ తవాపై లేయర్ పోతుంది.. అందుకే వీటిపై చెక్క గరిటేలను వాడమని చెబుతున్నారు..
*. నాన్ స్టిక్ తవా కొని వాడేటప్పుడు దానిని సబ్బు నీటితో క్లీన్ చేయొచ్చు. తర్వాత మెత్తని స్పాంజితో స్క్రబ్ చేయండి. ఇది మొత్తంగా ఆరిన తర్వాత క్లీన్ చేయాలి. నాన్ స్టిక్ ప్యాన్స్ తక్కువ, మధ్యస్థ వేడికి అనుకూలంగా ఉంటాయి.. ఎక్కువ మంటతో అస్సలు వండకూడదు..
*. కిచెన్‌లో ఈ కుక్‌వేర్‌ని ప్లేస్ చేసే స్థలం కూడా సరిగ్గా ఉండాలి. పదునైన అంచులు ఉన్న కంటెయినర్ మధ్యలో వీటిని పెట్టొద్దు. వీటన్నింటి సపరేట్ ప్లేస్‌లో పెట్టండి.. అప్పుడే వీటిపై గీతలు పడకుండా, ఏనామిల్ పోతుంది.. తర్వాత ఎందుకు పనిరాకుండా పోతాయి..
*. ఇక చివరగా వీటిలో వంట చేసిన వెంటనే కడగకూడదు.. కాసేపు నీటిలో నానబెట్టి కడగటం బెస్ట్.. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఆ ప్యాన్స్ ఎక్కువ రోజులు ఉంటాయి..