Leading News Portal in Telugu

Heart Diseases: ఈ 6 రకాల ఆహారపదార్థాలతో గుండె జబ్బులకు చెక్..


Heart Diseases: ఆధునిక జీవనశైలిలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా 30 ఏళ్ల లోపు వారికి కూడా హార్ట్ ఎటాక్ రావడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం, ఒత్తిడి, వ్యాయమం లేకపోవడం వంటివి గుండె జబ్బులకు కారణం అవుతున్నాయి.

ఒక అధ్యయనం ప్రకారం ఈ 6 ఆహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకుంటే గుండె జబ్బులు తగ్గే అవకాశాలు ఉన్నాయని తేలింది. పండ్లు, కూరగాయలు, నట్స్, చిక్కుళ్లు, చేపలు, కొవ్వుతో కూడిన పాలు హార్ట్ డిసీజెస్ ని తగ్గిస్తాయని పరిశోధకులు సూచిస్తున్నారు.

యూరోపియన్ హార్ట్ జర్నల్ ప్రచురించిన ఈ అధ్యయనంలో తేలింది. ఆరు వేర్వేరు అధ్యనాల ఫలితాలను మిళితం చేసి పరిశోధకులు ఈ వివరాలను వెల్లడించారు. 80 దేశాల నుంచి 2,40,000 మంది 20 ఏళ్ల డేటాను పరిశీలించి ఫలితాను వెలువరించారు. ఆహారపు అలవాట్లపై పరిశీలించి విశ్లేషించారు. అధికంగా పండ్లు, కూరగాయాలు, గింజలు, చిక్కుళ్లు, చేపలు, కొవ్వులు కలిగిన పాలను తీసుకున్న వారిలో గుండె జబ్బులు తక్కువగా ఉన్నట్లు మరణాల ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తేలింది.

పండ్లు: పండ్లు రోగనిరోధక వ్యవస్థను పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థ, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపుస్తాయి. చిన్న పేగుల్లో కొలెస్ట్రాలను తగ్గిస్తాయి. వీటిలో ఉండే పీచు పదార్థం కొవ్వులను తగ్గించడంలో సహరిస్తుంది.

కూరగాయలు: కూరగాయల్లో పాస్పరస్, సోడియం, మెగ్నీషియం, పోటాషియం, కాల్సియం ఉంటాయి, ఇవి హృదయ లయలను నిర్వహిస్తాయి.

చిక్కుళ్లు: శాకాహారులకు పప్పు ధాన్యాలు ప్రోటీన్లను సమకూర్చుతాయి. కండరాలు, అవయవాలు, రక్తకణాలతో సహా ఆరోగ్యమైన కణజాలాలను నిర్మించడానికి, నిర్వహించడానికి ఇవి సహాయపడుతాయి.

చేపలు: చేపల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గుండెకు కావాల్సిన కొవ్వులను కలిగి ఉంటాయి. సాల్మాన్, ట్యూనా, మాకెరెల్, సార్డినెస్ వంటి చేపలు ఒమేగా3 ఫ్యాటీ ఆసిడ్లను కలిగి ఉంటాయి. ఇది గుండెకు మంచివి.

నట్స్: గింజలు, మొలకల్లో గుండె ఆరోగ్యానికి మంచివి. అన్ సాచురేటెడ్ కొవ్వులను, మంచి కొవ్వులను పెంచుతాయి.

కొవ్వులతో కూడిన పాలు: కొవ్వులతో కూడిన పాలు గుండెకు చాలా మంచిదని తేలింది. పెరుగు, కాటేజ్ చీజ్ వంటివి గుండెకు మేలు చేస్తాయని అధ్యయనంలో తేలింది.