Leading News Portal in Telugu

Weight Loss : బెల్లం టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. రోజూ తాగుతారు తెలుసా?


బరువు పెరుగుతున్నా.. ఏం తినకపోయిన కూడా ఇంత లావు అవుతున్నా అని చాలా మంది మదన పడతారు.. అలాంటి వాళ్లు నలుగురులోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడతారు.. ఇక వెంటనే బరువు తగ్గాలని నానా యాతన పడుతుంటారు..మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లైతే.. బెల్లం టీ బెస్ట్‌ ఆప్షన్‌ అని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, దీనిలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, బి కాంప్లెక్స్‌, విటమిన్‌ సి, బి2, ఇ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.. ఇక బెల్లం టీతో ఎలా బరువు తగ్గుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బెల్లం టీని తీసుకోవడం ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.. మీరు త్వరగా బరువు తగ్గుతారు. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావడం వల్ల.. కొవ్వు రూపంలో పొట్టలో పేరుకుపోకుండా సహాయపడుతుంది. ఇది పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా సహాయపడుతుంది. బెల్లంలోని చక్కెర కంటెంట్ కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుందని.. ఇది మీ జీవ క్రియ రేటును మెరుగుపరుస్తుంది..

ఐరన్‌ లోపం రక్తహీనతకు దారితీస్తుంది, ఇది బరువు పెరగడానికి కూడా కారణం కావచ్చు. బెల్లం రక్తహీనతను దూరం చేస్తుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి. రక్త హీనత సమస్య నుంచి బయటపడటానికి బెల్లం చక్కని మార్గం.. ఈ బెల్లంలో పొటాషియం మెండుగా ఉంటుంది.. ఇది ఎలక్ట్రోలైట్‌ సమతుల్యతను కాపాడుతుంది. పొటాషియం కండరాలను నిర్మించడానికి, జీవక్రియను పెంచడానికి తోడ్పడుతుంది.. అధిక బరువును కరిగించడానికి ఇది సహాయ పడుతుంది..

టీని ఎలా తయారు చేసుకోవాలంటే?

నీళ్లు – 2 కప్పులు
బెల్లం – 2 – 3 టేబుల్‌ స్పూన్లు
టీ పొడి – 1 టీస్పూన్‌
అల్లం – 1 అంగుళం
యాలకులు – 3
దాల్చినచెక్క – చిన్న ముక్క
నల్ల మిరియాల పొడి – చిటికెడు..

ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్లు పోసి అల్లం, యాలకులు, తులసి ఆకులు, అల్లం, దాల్చినచెక్క నీళ్లలో వేయండి. దీన్ని 5 నిమిషాలు మరగబెట్టి, నల్ల మిరియాల పొడిని కలపండి. ఆ తర్వాత టీ పొడి, బెల్లం మిక్స్‌ చేయండి.. దీన్ని బాగా మరగనిచ్చి, చల్లార్చి తీసుకోవడం మంచిది.. రోజు ఉదయం సాయంత్రం తీసుకోవడం మంచిది..