Leading News Portal in Telugu

Beauty Tips : పాపాయతో ఇలా చేస్తే చాలు..ట్యాన్ మొత్తం క్షణాల్లో తగ్గిపోతుంది..


బయటకు వెళ్లాలంటే ఎండ వేడి.. వాతావరణ కాలుష్యాల వల్ల చర్మానికి ట్యాన్ పడుతుంది.. చర్మంలో మెలనిన్ కంటెంట్ పెరిగి.. స్కిన్ పిగ్మెంటేషన్ ను పెంచుతుంది.. ఫలితంగా చర్మం నల్లగా, డల్ గా మారుతుంది. సూర్య కాంతి చర్మంలోని త్రేమను గ్రహిస్తుంది. అందుకే చర్మం పొడిబారుతుంది. సన్ స్క్రీన్ లోషన్స్ వాడటం వల్ల సూర్యరశ్మిని నివారించలేం. తినే ఆహారం, తాగే పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలోకి వెళ్లే ముందు ముఖాన్ని పూర్తిగా కప్పుకోవడం.. లేదా క్రీములు వాడటం చెయ్యాలి.. బొప్పాయి తో కూడా చర్మ నిగారింపు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు..

బొప్పాయి పండును ఫేస్ ప్యాక్‌ గా, ఫేస్ మాస్క్ గా స్క్రబ్‌ గా ఉపయోగించడం వల్ల స్కిన్ ట్యానింగ్ సమస్యలను దూరం చేసుకోవచ్చు. డార్క్ పిగ్మంటేషన్ సమస్య నుండి బయటపడేందుకు సహాయపడుతుంది..

ఇక ఈ పండులోని పపైన్ ఎంజైమ్ యాంటీ ఏజింగ్ ఏజెంట్‌ గా పనిచేస్తుంది. ఇది చర్మం వృద్ధాప్య ప్రభావాన్ని నియంత్రిస్తుంది. బొప్పాయి గుజ్జును ముఖానికి పట్టించి మసాజ్ చేయాలి. ఈ పల్ప్ ను ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకుని కూడా వాడొచ్చు… వారానికి రెండుసార్లు వాడితే మంచి ఫలితం ఉంటుంది..

బొప్పాయిని పొట్టుతీసి మెత్తగా చేసుకోవాలి అందులో పచ్చిపాలు కలిపి పేస్ట్ లా చేసుకుని, ముఖానికి రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో 3-4 సార్లు చేస్తే.. ట్యాన్ పోయి ముఖం అందంగా మృదువుగా మారుతుంది..

ఈ పండును ఫేస్ ప్యాక్‌ గా, ఫేస్ మాస్క్ గా స్క్రబ్‌ గా ఉపయోగించడం వల్ల స్కిన్ ట్యానింగ్ సమస్యలను దూరం చేసుకోవచ్చు. డార్క్ పిగ్మంటేషన్ సమస్య నుండి బయటపడేందుకు సహాయపడుతుంది… చర్మం పై మచ్చలు కూడా పోతాయి అందుకే వీటిని ఎక్కువగా సౌందర్య సాధానాలలో వాడుతారు..