Leading News Portal in Telugu

Kidney Stones: కిడ్నీలో రాళ్లను కరిగించే అద్భుతమైన చిట్కాలు..


ఈరోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం అనేది లేదు.. రసాయనిక ఎరువుల వల్ల తినే ఆహారం కూడా కలుషితం అవుతుంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని ఈ సమస్య వేధిస్తుందని చెప్పవచ్చు.. మూత్రపిండాలల్లో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి, తీవ్రమైన బాధ కలుగుతుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, నీటిని ఎక్కువగా తాగకపోవడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. సాధారణంగా ఈ సమస్య నుండి బయటపడాలంటే శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని చాలా మంది భావిస్తారు… అందుకోసం అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి తెలుసుకుందాం..

మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో రణపాల ఆకు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ముందుగా ఒక రణపాల ఆకులను రోట్లో వేసి మెత్తగా దంచాలి. తరువాత ఇందులోనే 3 మిరియాలు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా దంచి ఈ మిశ్రమం నుండి రసాన్ని తీయాలి. ఇలా తయారు చేసుకున్న రసాన్ని 50 ఎమ్ ఎల్ మోతాదులో రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల 15 నుంచి 20 రోజులలో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు..

అంతేకాదు మరో చిట్కా..కొండపిండి ఆకును వేర్లతో సహా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను దంచి గిన్నెలో వేసి లీటర్ నీటిని పోసి మరిగించాలి. ఈ లీటర్ నీరు పావు లీటర్ అయ్యే వరకు బాగా మరిగించి వడకట్టాలి. తరువాత ఈ నీటిలో పటిక బెల్లం వేసి కలిపి పరగడుపున తాగాలి. ఇలా కొండపిండి ఆకుతో కషాయాన్ని తయారు చేసుకుని రోజూ అంటే ఒక వారం రోజులు తీసుకుంటే మంచిది.. రాళ్లు కరిగిపోతాయి..

చివరగా పల్లేరు కాయల తీగను తీసుకొని నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య చాలాసులభంగా తగ్గుతుంది. ఈ విధంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు రోజు కొద్ది రోజులు పరగడుపున తీసుకుంటే రాళ్లు పడిపోతాయి.. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.. అన్నిటికన్నా ముఖ్యమైంది నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి..