వర్షాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఊపందుకున్నాయి.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాలు పడుతుంటే మరోవైపు వ్యాదులు కూడా పలకరిస్తాయి..దగ్గు, జలుబు, ఫ్లూ, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.. ఇలాంటి వ్యాదులు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
*. వర్షాకాలంలో తేలికపాటి, సమతుల ఆహారం తీసుకోవాలి. లీన్ ప్రోటీన్స్, తృణధాన్యాలు కలిసి ఉండే భోజనాన్ని తినాలి. వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి తినాలి. చికెన్, చేపలు, టోఫు వంటి లీన్ ప్రోటీన్స్ ద్వారా కండరాలు పెరుగుతాయి. కూరగాయలలో ఉండే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి..
*. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆహారంలో విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినాలి. నిమ్మకాయలు, నారింజ పండ్లు, ద్రాక్ష పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. బ్రకోలీ, బెల్ పెప్పర్స్, కివీస్‌లో కూడా విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధుల నుంచి కాపాడుతాయి..
*. వర్షాలు పడుతున్నాయి కదా అని నీళ్లను తాగడం అస్సలు మరువకండి..వర్షం వల్ల వచ్చే అధిక తేమ కారణంగా డీహైడ్రేట్‌కు కారణం అవుతుంది. రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం ద్వారా హైడ్రేట్‌గా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు..
*. కషాయాలు, హెర్బల్ టీలు, సూప్ లు తాగడం చాలా మంచిది.. బాడిలో వేడిని పెంచుతాయి..వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి..
*. యాపిల్స్, బేరి, దానిమ్మ, నారింజ పళ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇవి వర్షాలకు వచ్చే ఇన్ఫెక్షన్ ల నుంచి కాపాడుతాయి.. వీటితో పాటు ఎప్పటికప్పుడు వేడిగా ఆహారాన్ని చేసుకొని తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..