చాలా మంది ఈ ఫైనాఫిల్ ను తినడానికి ఇష్టపడరు.. ఎందుకంటే దాన్ని తినడం కన్నా కొయ్యడం చాలా కష్టమైనపని.. కొందరు అవి పుల్లగా ఉంటాయనే కారణంతో అస్సలు ముట్టుకోరు. మీరు కూడా అదే పని చేస్తుంటే.. తప్పకుండా ఈ పండు ప్రయోజనాలను తెలుసుకోవల్సిందే. ఎందుకంటే.. ఈ పండును మీరు పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యాన్ని పొందే అవకాశాలను వదులుకుంటున్నారు.. రుచి, సువాసనతోపాటు ఈ పండులో 85 శాతం నీరు ఉంటుంది. ఇందులో చక్కెర 13 శాతమే ఉంటుంది. పీచు పదార్థం 0.35 శాతం ఉంటుంది. విటమిన్ A, B, Cలు దీనికి బోనస్. అనాస తినడం వల్ల ఆరోగ్యానికి ఇంకా ఏయే ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పైనాఫిల్ పండును తీసుకోవడం వల్ల పచ్చకామెర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మూత్ర పిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగించే గుణాలు ఇందులో ఉన్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. నడుము నొప్పి, ఇతరాత్ర ఒళ్లు నొప్పులతో బాధపడేవారికి కూడా ఈ పండు మంచిదే. అనాస పండు ముక్కలకు తేనెతో కలిపి తింటే శారీరక శక్తి లభిస్తుంది..
అధిక బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నించేవాళ్లు ఈ పండును చిన్న ముక్కలు చేసి నీటిలో వేయండి. నాలుగు టీస్పూన్ల వాము పొడి వేసి నీటిని మరిగించండి. తర్వాతి రోజు ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా కనీసం పది రోజులు ప్రయత్నించి చూడండి.. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.. త్వరగా బరువు తగ్గుతారు..
చర్మ రక్షణకు..చర్మం నిగారింపుకు ఎంతో మంచిదట. గొంతు నొప్పి, పుండ్లతో బాధపడేవారు. అనాస పండు రసాన్ని తాగితే ఉపశమనం లభించవచ్చట. అనాస పండు పచ్చకామెర్లకు మంచి ఔషధంలా పనిచేస్తుందట. జీర్ణ సమస్యలను సైతం ఫైనాఫిల్ పరిష్కరిస్తుంది..
పిల్లలకు ఈ పండు చాలా మంచిది.. పైనాపిల్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాబట్టి.. తప్పకుండా పిల్లలకు ఇవ్వండి. ఇది ఎముకులు, శారీరక పెరుగుదలకు ఉపయోగపడుతుంది… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఒకసారి తెలుసుకోండి.. ఇకనైనా మీ డైట్ లో ఈ పండును చేర్చుకోండి..