Sitting Position: పిల్లలకు ఎన్నో అలవాట్లు ఉంటాయి. వారు తెలిసి తెలియని చేసే పనులు పెద్దలకు మురిపిస్తాయి. వాళ్ళ బుజ్జి బుజ్జి మాటలు, బుడి బుడి నడకలు, చిన్న చిన్న చేష్టలు పెద్దవాళ్ళు కూడా ఆనందిస్తారు. వారి మాటలే కాదు.. కూర్చునే విధానం, చిలిపి చేష్టలు ఆకట్టుకుంటాయి. కానీ.. పెద్దలు గమనించలేనిది ఏమిటంటే.. వారు కూర్చునే విధానం. పిల్లలు వారు సౌకర్యార్థం ఎలా కూర్చుంటే బాగుంటుందో అలా కూర్చుంటారు. కానీ అది వాళ్లకు పెద్ద సమస్య తెచ్చి పెడుతుందని పెద్దలు గమనించలేరు. పిల్లలు కూర్చునే విధానంలో చాలా కొత్తదనం ఉంది. ప్రతి రోజు వారు భిన్నంగా కూర్చుంటారు.
అలా కూర్చునే విధంగా W ఆకారంలో కూర్చుంటారు. ఇది కాస్త వింతగా ఉన్నా మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. పిల్లలు ఇలా కూర్చోవచ్చు, కానీ పెద్దలు అలా కూర్చోలేరు. పిల్లలు చాలా సేపు ఇలా కూర్చోవచ్చు. కానీ, నిజానికి అలా అస్సలు కూర్చోకూడదని నిపుణులు అంటున్నారు. అలా కూర్చుంటే వెంటనే అలా కూర్చోవద్దని వాళ్ళకు తెలిసేనా చెప్పాలి. కొంతమంది పిల్లలు కొద్దిసేపు ఇలా కూర్చుంటే, మరికొందరు పిల్లలు ఎక్కువసేపు అలానే కూర్చుంటారు. అయితే, ఇది అలవాటుగా మారితే, అది వారి శరీర ఆకృతి, కదలికలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇలా కూర్చోవడం వల్ల కండరాలు బలపడవు. ఎందుకంటే ఈ భాగంలో కండరాలు పనిచేయవు. ఇలా కూర్చోవడం వల్ల వెన్నెముక కండరాలు బలహీనపడతాయి. ఈ భంగిమ వల్ల కండరాలు వంకరగా మారతాయి.
Read also: Hyderabad: నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ మటన్ క్యాంటీన్
ఈ భంగిమలో కూర్చున్న పిల్లలకు ఎముకలకు సంబంధించిన వ్యాధులు, యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ సమస్యలు, వెన్నునొప్పి వంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూర్చున్నప్పుడు బ్యాలెన్స్ తగ్గుతుంది. ఎదుగుదల ఉండదు. నడుస్తున్నప్పుడు పాదాల ఎత్తు ఉండదు. వెన్ను సమస్యలు వెన్ను బలహీనత, కండరాల బలహీనత వంటి సమస్యలను కలిగిస్తాయి. మస్తిష్క పక్షవాతం ఉన్న పిల్లలు, మెదడు అభివృద్ధి మందగించిన పిల్లలు, తొడ కండరాల సమస్యలు ఉన్న పిల్లలు కూడా ఈ విధంగా కూర్చుంటారు. పిల్లలు ఇలా కూర్చుంటే వెంటనే చెప్పి మామూలుగా కూర్చోమని చెప్పండి. అలాగే బయటకి వెళ్లి ఆడుకుందాం అంటూ వారిని డబ్లూ ఆకారంలో, ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోకుండా ప్రయత్నించండి. అవసరమైతే వైద్యుల సహాయం తీసుకోండి. ఈ అలవాటును ఒక్కసారిగా వదిలించుకోవడం కష్టం. కానీ, నెమ్మదిగా ఈ అలవాటు నుండి బయటపడేటట్లు చేయండి.
India Squad for CWC23: ఇట్స్ ఆఫీషియల్.. ప్రపంచకప్ 2023లో ఆడే భారత జట్టు ఇదే! తెలుగోడికి షాక్