డ్రై ఫ్రూట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అందులో బాదం ను తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అయితే బాదం ఎక్కువగా తింటారు ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. బాదం పప్పుని చాలామంది నానబెట్టుకొని తింటారు. అలా ఎందుకు తింటారు, దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బాదంలో ప్రోటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ లు , ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ లు, విటమిన్ ఈ, క్యాల్షియం, జింక్,ఫాస్ఫరస్ వంటి ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు అదుపులో ఉంటాయి.. అంతేకాదు నానబెట్టిన బాదంపప్పులో ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడంవల్ల గుండె ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలని అదుపులో ఉంచుతుంది. అందుకే బరువును సులువుగా తగ్గావచ్చునని నిపుణులు చెబుతున్నారు..
నానబెట్టిన తర్వాత పై తొక్కు తీసి తినటం వలన సులువుగా పోషకాలు మొత్తం అందుతాయి. పచ్చి బాదం గోధుమ చర్మంతో పొరలుగా ఉంటుంది.. జీర్ణ శక్తి మెరుగు పడుతుంది.. గర్భిణీ స్త్రీలు నిత్యం బాదంపప్పు తినటం అలవాటు చేసుకుంటే తల్లితోపాటు కడుపులో ఉన్న బిడ్డకి కూడా మంచి పోషకాలు అందుతాయి.. బాదం లో ఉండే పోలిక్ యాసిడ్స్ పుట్టుకతో వచ్చే లోపాలని నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాదు నానబెట్టిన బాదంపప్పులో లైపర్స్ అనే ఎంజాయ్ ఉంటుంది. ఇది కొవ్వుని కరిగించడంలో సహాయపడుతుంది. ఈ పప్పును మెత్తగా మిక్సీ పట్టి కాస్త తేనె వేసి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకుంటే ముఖం అందంగా మెరుస్తుంది..