మనం ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసుల్లో ఒకటి యాలకులు.. వీటిని వంటలకు రుచిని, సువాసనను పెంచేందుకు వాడుతారు.. అలాంటి యాలకులలో పుష్కలమైన ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్లు-రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి, ఖనిజాలు-ఐరన్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పినిన్, సబినిన్, మైసిన్, ఫెలాండ్రిన్, డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అనేకం ఈ యాలకుల్లో లభిస్తాయి. ఇలాంటి యాలకులను టీలో గానీ, తాగే నీళ్లలో గానీ వేసి మరిగించి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.. మరి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
యాలుకల టీని రోజు తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి.. రోజూ ఒక గ్లాసు యాలకుల నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాలకుల విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాలకుల నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడటమే కాకుండా, కడుపునొప్పి నుండి ఉపశమనం పొందడంతోపాటు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. యాలకులతో మరిగించిన నీటిని తాగటం వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది..
టీని కాచి యాలుకల పొడిని లేదా యాలుకలను వేసుకొని తాగడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్తమాను నివారించడంలో యాలకులు చాలా మేలు చేస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు యాలకుల నీటిని తాగాలి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి.. దంతాలను శుభ్రం చేస్తాయి.. అలాగే నోటి దుర్వాసన ను తగ్గిస్తాయి.. ఫైటోకెమికల్ అయిన సినియోల్, దుర్వాసన బాక్టీరియాను చంపడానికి, కావిటీస్ మరియు దంత క్షయాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది.. అలాగే లైంగిక సామార్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది… ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..