Leading News Portal in Telugu

Body Spray : బాడీ స్ప్రై ఎక్కువగా వాడుతున్నారా? ఇది మీ కోసమే..


చెమట వాసన రాకుండా పొద్దున్నే లేచినప్పటి నుంచి స్నానం చేస్తే ఒళ్లు కరిగిపోతుందని చాలా మంది బాడీ స్ప్రైలను వాడుతూ జనాల్లో తిరుగుతున్నారు.. ఒకటి కాదు రెండు కాదు మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన బ్రాండులను వాడుతారు.. అయితే సువాసన మాట అంటుంచితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు.. అయిన ఎవ్వరు వినట్లేదు.. ఏదైనా వస్తే చూద్దాం కదా అంటూ పెడ చెవిన పెట్టేస్తున్నారు.. ఈ స్ప్రై లను ఎక్కువగా వాడితే ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

డియోడ్రెంట్స్ ఎక్కువగా అండర్ ఆర్మ్స్ లో కొట్టడం చూస్తుంటాం. ఆడవారిలో ఇది వక్షోజాలకి దగ్గరి ప్రాంతం. కాబట్టి ఆ స్ప్రే బ్రెస్ట్ టిష్యూలపై ప్రభావం చూపుతుంది. ఈ రకంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది..

పెర్ఫ్యూమ్స్ ని తయారుచేయడానికి రకరకాల కెమికల్స్ వాడతారు. వీటి తయారిలో ట్రైక్లోసన్ అనే పెస్టిసైడ్ కూడా ఉపయోగిస్తారు. ఇది ఏరకంగానూ మీ చర్మ ఆరోగ్యానికి మంచిది కాదు..

ఇకపోతే ఈ స్ప్రేలలో పరాబెన్స్, పథలేట్స్ అనే పదార్థాలు ఉంటాయి. వీటిని చిన్నపిల్లలు (అమ్మాయిలు) వాడితే త్వరగా రజస్వల అయ్యే అవకాశం ఉంటుంది..

గర్భిణీ స్త్రీలు పెర్ఫ్యూమ్స్ బాటిల్స్ పై మక్కువ చూపిస్తే అది బిడ్డకే ప్రమాదం. ప్రాణాపాయ స్థితి ఉన్నా లేకున్నా, బిడ్డ ఏదో ఒక లోపంతో పుట్టే ప్రమాదం ఉంటుంది..ఈ స్ప్రై లో ఎక్కువగా ఎథనాల్ ఉంటుంది.. చర్మాన్ని పొడిగా మారుస్తుంది..

ఇదిలా ఉండగా.. మార్కెట్లో దొరుకుతున్న చాలా పెర్ఫ్యూమ్స్ లో అలుమినియం డిరైవెటివ్స్ ఉంటున్నాయి. ఈ కారణంతో మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెప్పాయి.. ఈ విషయం పై పూర్తి సమాచారాన్ని అధికారులు ధ్రువీకరించలేదు.. కొన్ని స్ప్రై ల వల్ల బట్టలకు మరకలు అంటుకుంటాయి.. అవి త్వరగా పోవు కూడా..కొంతమందికి తల నొప్పి కూడా వస్తుంది.. అలెర్జీలు కూడా వస్తాయి.. ఇది గుర్తుంచుకోండి..