Leading News Portal in Telugu

Health Tips : రోజూ పప్పును తింటున్నారా? ఇది తెలిస్తే ఇక పప్పు జోలికి వెళ్లరు..


పప్పు ఆరోగ్యానికి మంచిది.. శాకాహారం తీసుకొనే వారికి ఇది మాంసంలోని పోషకాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..అది నిజమే కానీ.. బాగుంది కదా అని రోజూ అదే పని చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. టమాటా పప్పు, సాంబర్ అంటూ ఏదో ఒక రూపంలో పప్పులను వారంలో నాలుగైదు రోజులైనా తింటుంటారు. నిజానికి పప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పుల్లో పొటాషియం, ఫైబర్, విటమిన్ బి, ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి… అయితే పప్పును ఎక్కువగా తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

*. పప్పు కూరను ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పప్పులో డైటీర ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తింటే ఇది అరగడం చాలా కష్టమవుతుంది. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు తిమ్మిరి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి..

*. బరువు తగ్గాలనుకుంటున్న వారు కూడా పప్పును ఎక్కువగా తింటారు. ఎందుకంటే దీనిలోని ప్రోటీన్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. కానీ పప్పుల్లో ఉండే కేలరీలు, కార్భోహైడ్రేట్లు మీ బరువును పెంచుతాయి. అందుకే పప్పును ఎక్కువగా తినకూడదు..

*. పప్పుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అయితే వీటిని మరీ ఎక్కువగా తింటే మాత్రం పోషక లోపం సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పప్పుల్లో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే ఇది మన శరీరంలో సోడియం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీస్తుంది..అందుకే పప్పును అధికంగా అస్సలు తీసుకోకూడదు..

*. పప్పును అధికంగా తీసుకోకుంటే కిడ్నీల పై చెడు ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పప్పుల్లో ఆక్సలేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇలాంటి పప్పును ఎక్కువగా తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.. అంతేకాదు పిత్తాశయం పై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.. ఇంత తెలుసుకున్నాక పప్పును రోజూ తీసుకోకండి.. వారానికి ఒకటి, రెండుసార్లు ఎక్కువ.. అది కూడా బకెట్లు కాకుండా లిమిట్ గా తీసుకోవడం మంచిది..