Leading News Portal in Telugu

Weight Loss : బొప్పాయిని ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారా?


బొప్పాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలు అందుబాటులో ఉన్నాయి.. విటమిన్‌-ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫోలేట్‌ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. బొప్పాయి తరచుగా తింటే.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలసటను దూరం చేస్తుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బొప్పాయిలో నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది త్వరగా జీర్ణమవడమే కాకుండా కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. బొప్పాయి తరచు తీసుకుంటే.. బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. మరి బొప్పాయిని ఎలా తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

సాధారణంగా బొప్పాయిలో పపైన్‌, చైమోపాపైన్‌ ఉంటాయి. ఈ రెండూ జీర్ణక్రియకు, మలబద్ధకంతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది కడుపులో పూత నివారణ, నయం చేయడానికి తోడ్పడతాయి. బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన గట్, జీర్ణవ్యవస్థ చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు..

ఈ పండులో పాపైన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్‌.. బరోవు కోల్పోకుండా నిరోధించే అవకాశం ఉందని ఇటీవల జరిపిన పరిశోధన లో వెళ్లడయింది..

అత్యంత పోషకమైన పండు అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్‌, లిపిడ్లను విచ్ఛిన్నం చేయడానికి, నిర్మూలించడానికి సహాయపడుతుంది. శరీరానికి పోషణను కూడా అందిస్తుంది..

కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల బొప్పాయిలో 43 కేలరీలు ఉంటాయి. అదనంగా, బొప్పాయిలో విటమిన్ సి, కాల్షియం, విటమిన్ ఎ, మెగ్నీషియం వంటివి వీటిలో అధికంగా ఉంటాయి..

కొంతమంది కడుపులో యాసిడ్‌ లు తక్కువగా ఉంటాయి.. అలాంటి వారికి, బొప్పాయిలో ఉండే పపైన్ సహాయం చేస్తుంది. ఇది మాంసాన్ని జీర్ణం చేయడానికి, మాంసం నుంచి వచ్చే ప్రొటీన్‌ గ్రహించడానికి సహాయపడుతుంది. కొవ్వును కరిగించడానికి, బరువు తగ్గడానికి ప్రొటీన్ తోడ్పడుతుంది.. రోజూ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గుడ్ బై చెప్పొచ్చు.. అలాగే చర్మ సంరక్షణకు కూడా ఇది సహాయపడుతుంది… ఇన్ని ప్రయోజనాలు ఉన్న బొప్పాయిని మీ డైట్ లో చేర్చుకోండి ఆరోగ్యంగా ఉండండి..