Leading News Portal in Telugu

Health Tips : బార్లీ గింజలను తీసుకుంటే బరువు తగ్గుతారా?


బార్లీ గింజల గురుంచి చాలామందికి తెలియదు.. వీటిని బ్రెడ్స్, జ్యూస్ ల తయారిలో ఎక్కువగా వాడతారు.. వీటి తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.. దాంతో కొందరు డైట్ లో భాగం చేసుకున్నారు.. బార్లీలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. బార్లీలో శక్తి, పొటాషియం, ఫైబర్, ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. బార్లీని ఉడికించి ఆహారంగా తీసుకున్నా లేదా నీటిలో మరిగించి ఈ నీటిని తాగినా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారికి బార్లీ చక్కటి ఆహారమని చెప్పవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు బార్లీ గింజలవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బార్లీ మనకు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి… శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండే ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బార్లీని ఉడికించిన నీటిని తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గు ముఖం పడుతుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. శరీరంలో మలినాలు తొలగిపోతాయి. శరీరం శుభ్రపడుతుంది. బార్లీనిఆహారంగా తీసుకోవడం వల్ల మనం పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటాము. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి దోహధపడతాయి . వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేగుల్లో కదలికలు పెరిగి మలబద్దకం సమస్య నివారించబడుతుంది..

రోజూ బార్లీని తీసుకోవడం వల్ల ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఆస్ట్రోపోరోసిస్ వంటి ఎముకలకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కూడా బార్లీ గింజలను మనకు తోడ్పడతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, వృద్దాప్య ఛాయలను మన దరి చేరకుండా చేయడంలో, గాయాలను త్వరగా మానేలా చేయడంలో, శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో బార్లీ గింజలు మనకు ఉపయోగపడతాయి… మీరు ట్రై చెయ్యండి..