Leading News Portal in Telugu

Cancer Symptoms: క్యాన్సర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు.. జాగ్రత్త తీసుకోండి


Cancer Symptoms: ఈ మధ్య కాలంలో ఎవరికి ఎప్పుడు గుండె పోటు వస్తుందో,  ఎవరు ఎప్పుడు క్యాన్సర్ బారిన పడతారో అర్థం కావడం లేదు. మన ముందు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా తిరిగిన వారికి అకస్మాత్తుగా క్యాన్సర్ అని తెలుస్తుంది. అయితే ఈ క్యాన్సర్ ను ముందే పసిగట్టగలిగితే వెంటనే అరికట్టవచ్చు.  క్యాన్సర్ వచ్చినప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఇక క్యాన్సర్ వచ్చే ముందు ఆకలి తగ్గడం, ఎడతెరిపి లేకుండా దగ్గు , లింఫ్‌ గ్లాండ్స్‌ (చంకల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు, కారణం లేకండానే బరువు విపరీతంగా తగ్గిపోవడం, కొన్ని సార్లు అవయవాల నుంచి రక్తం కారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇక బ్రెయిన్‌ క్యాన్సర్‌ అయితే తలనొప్పి, అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్ని సార్లు అందరిలో ఉన్నా కూడా ఎలా పడితే అలా ప్రవర్తించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే బ్రెయిన్ కి సంబంధించి ఏ పార్ట్ కి అయితే క్యాన్సర్ సోకుతుందో ఆ భాగం చచ్చుబడిపోతుంది. ఇక గొంతు క్యాన్సర్ వస్తే గొంతులో ఏదో ఇరుక్కుంది అన్న భావన ఉంటుంది. మింగడం కష్టంగా ఉంటుంది. ఇక మహిళలల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ లలో ఒకటి సర్విక్స్‌ క్యాన్సర్‌.  పిరియడ్స్ సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్‌) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్‌ తర్వాత రక్తస్రావం ఎరుపు, తెలుపు డిశ్చార్జీ వంటివి దీని ప్రధాన లక్షణాలు. ఇక ఆడవారిలో వచ్చే మరో ప్రధానమైన క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ఇది వచ్చే ముందు రొమ్ము పరిమాణంలో మార్పులు కనిపిస్తాయి. రొమ్మును పట్టుకుంటే గడ్డలు తగులుతాయి. పైన చెప్పిన లక్షణాలు ఉన్నంత మాత్రాన అది క్యాన్సర్ అని గ్యారెంటీ కాదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించి పరీక్షలు చేయించి నిర్ధారణ చేసుకుంటే మంచిది.