
Smoking: స్మోకింగ్.. సిగరేట్లను పీల్చుతూ సరదాగా రింగురింగులుగా వదులుతుంటారు. ఈ సరదానే తరువాత అలవాటుగా మారుతుంది. స్మోకింగ్ వల్ల దీర్ఘకాలంగా పలు వ్యాధులకు కారణమౌతాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయి. క్యాన్సర్లకు కారణమవుతుంది. ఇదిలా ఉంటే ఇది మీ యవ్వనాన్ని కూడా ఖర్చు చేస్తుంది. త్వరగా వృద్ధాప్యానికి కూడా కారణమవుతుందని తాజా స్టడీలో తేలింది. పొగతాగడం వల్ల త్వరగా ముసలివాళ్లు అవుతారని చెబుతోంది.
ఇటలీలోని మిలన్‌లోని యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్‌లో సమర్పించిన అధ్యయనం ప్రకారం ధూమపానం మన రోగనిరోధక వ్యవస్థలోని తెల్ల రక్త కణాలలో క్రోమోజోమ్‌ల చివరి ముక్కలను తగ్గిస్తుందని తేలింది. టెలోమియర్స్ అని పిలిచే ఈ శకలాల పొడవు వృద్ధాప్యం, పునరుత్పత్తి చేసే మన కణాల సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం.. స్మోకింగ్ ల్యూకోసైట్ టెలోమీర్ పొడవును తగ్గిస్తుందని, ఇది స్వీయ కణాజాల మరమ్మత్తు, పునరుత్పత్తి, వృద్ధాప్యం ఇంటికేటర్ గా పనిచేస్తుంది. మరో విధంగా చెప్పాలంటే ధూమపానం వృద్ధాప్య ప్రక్రియను మరింత వేగం చేస్తుంది. స్మోకింగ్ మానేస్తే ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని చైనా లోని హాంగ్ జౌ నార్మల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సియు డై వెల్లడించారు.
Read Also: Physical Harassment: ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..! కాలేజ్ నుంచి వస్తుండగా ఎత్తుకెళ్లి..
టెలోమిర్స్ క్రోమోజోముల చివరలను రక్షించే పునరావృత డీఎన్ఏ సీక్వెన్స్. ఒక కణం విభజించిన ప్రతీ సారి టెలోమిర్ల పొడవు కొంచె చిన్నదిగా మారుతాయి. ఒకవేళ బాగా చిన్నవిగా అయితే చివరకు కణం విజయవంతంగా విభజించబడదు, తర్వాత చనిపోతుంది. ఇది వృద్దాప్య ప్రక్రియలో భాగం. తెల్ల రక్త కణాల్లో టెలోమీర్స్ పొడవు(ల్యూకోసైట్స్ అని పిలుస్తారు) స్మోకింగ్ తో ముడిపడి ఉంటుంది. అయితే టెలోమీర్ పొడవు తగ్గడానికి సిగరెట్లు కారణమౌతున్నాయా..? అనేదానిపై చాలా తక్కువ పరిశోధనలు జరిగాయి.
పరిశోధకులు యూకేలోని 4,72,174 మంది జన్యుడేటాను విశ్లేషించారు. ప్రస్తుతం స్మోకింగ్ చేసేవారు, చేయని వారు, గతంలో చేసి మానేసిన వారి వివరాలను నమోదు చేశారు. ఈ పరిశోధనల్లో ల్యూకోసైట్ టెలోమీర్ పొడవుతో ముడిపడినట్లు తేలింది. స్మోకింగ్ చేసే వారిలో, చేయని వారితో పోలిస్తే ల్యూకోసైట్ టెలోమీర్ పొడవు తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇటీవల కాలంలో ల్యూకోసైట్ టెలిమీర్ లెంన్త్ గుండె జబ్బులు, మధుమేహం, కండరాల నష్టం వంటి వ్యాధుల్లో గమనించారు. స్మోకింగ్ వల్ల టెలోమీర్ పొడవు ఈ వ్యాధుల్లో కూడా ప్రభావం చూపిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.